ఏపీలో ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం

|

Mar 01, 2019 | 2:56 PM

అమరావతి: ఎమ్మెల్యే కోటా ఐదు ఎమ్మెల్సీ స్థానాల నామినేషన్ పరిశీలన పూర్తయ్యింది. నామినేషన్‌ దాఖలు చేసిన నలుగురు తెలుగుదేశం అభ్యర్థులు, ఒక వైకాపా అభ్యర్థి పత్రాలను ఈసీ ఆమోదించింది. మొత్తం ఐదు ఖాళీలకు ఐదు నామినేషన్లు దాఖలవడంతో అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవమైంది. దీంతో ఎమ్మెల్సీలుగా తెలుగుదేశం పార్టీకి చెందిన యనమల రామకృష్ణుడు, అశోక్‌బాబు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడుతో పాటు వైకాపాకు చెందిన జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.

ఏపీలో ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం
Follow us on