ఏపీ ఎలక్షన్ వార్‌లో టీడీపీ-వైసీపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని జోస్యం చెప్పారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసీ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రాదు అన్న విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఎవరు అధికారంలోకి వస్తారనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేనన్న తులసీ రెడ్డి..అన్ని జిల్లాల్లోనూ టీడీపీ-వైసీపీ పోటా పోటిగా తలపడ్డాయని పేర్కొన్నారు. టీవీ9 నిర్వహించే బిగ్ న్యూస్- బిగ్ డిబేట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కొంచెం ఎడ్జ్ టీడీపీ వైపు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. పెన్షన్స్, పసుపు-కుంకుమ వంటి సంక్షేమ పథకాలు టీడీపీకి అనుకూలించే అంశాలుగా చెప్పారు.