జగన్ సాయం కోరిన కేసీఆర్, వెంటనే స్పందించిన ఏపీ సీఎం

|

Oct 19, 2020 | 9:47 PM

భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్‌ నగరం వణుకుతోంది. గత పది రోజులుగా రోజూ వర్షం పడుతుంది. చాలా ప్రాంతాల్లో వరదనీరు బీభత్సం సృష్టించింది.

జగన్ సాయం కోరిన కేసీఆర్, వెంటనే స్పందించిన ఏపీ సీఎం
Follow us on

భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్‌ నగరం వణుకుతోంది. గత పది రోజులుగా రోజూ వర్షం పడుతుంది. చాలా ప్రాంతాల్లో వరదనీరు బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సాయం కోరారు.   తెలంగాణ ప్రభుత్వం కోరిన సాయాన్ని వెంటనే అందించాలని సీఎం జగన్ వెంటనే అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా స్వీడ్‌ బోట్లను, సహాయ బృందాలను తరలించాలని అధికారులకు సూచించారు. మరోవైపు రాబోయే 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేయడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

కాగా హైదరాబాద్‌లో ఏ క్షణాన ఇళ్లలోకి వరద ముంచెత్తుతోందోననే  నగరవాసులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇప్పటికే సిటీలోని ప్రధాన ప్రాంతాలతో పాటు, ముసీ పరివాహక ప్రాంతం వరద నీటిలో చిక్కుకుంది. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ జల దిగ్భందంలోనే ఉన్నాయి.

Also Read : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు