దేశంలోనూ ముక్కు ద్వారా టీకా..!
కరోనా వ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలు అన్నీ ఇంజెక్షన్ రూపం లోనే సాగుతున్నాయి. ముక్కు ద్వారా ఉపయోగించే టీకా (ఇంట్రా నాసల్ కొవిడ్ వ్యాక్సిన్ ) చివరి దశ ప్రయోగాలు దేశంలో భారీ స్థాయిలో చేపట్టడానికి సన్నాహాలు చేపట్టింది ప్రభుత్వం.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకుంటున్నాయి. వ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలు అన్నీ ఇంజెక్షన్ రూపం లోనే సాగుతున్నాయి. ముక్కు ద్వారా ఉపయోగించే టీకా (ఇంట్రా నాసల్ కొవిడ్ వ్యాక్సిన్ ) చివరి దశ ప్రయోగాలు దేశంలో భారీ స్థాయిలో చేపట్టడానికి సన్నాహాలు చేపట్టింది ప్రభుత్వం. ప్రాథమిక దశ తర్వాతి దశ ట్రయల్స్‌ను భారత్‌కు చెందిన ఫార్మాసంస్థలు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ చేపడతాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా దీనికి అనుమతించిన తరువాత కొద్ది నెలలకే ఇది అందుబాటు లోకి వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
దాదాపు 40 వేల మంది వాలంటీర్లపై ఈ ట్రయల్స్ జరుగుతాయన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. ప్రస్తుతం కొనసాగుతున్న మూడో దశ వ్యాక్సిన్ ప్రయోగాలున్నీ ఇంజక్షన్ రూపంలోవే. ఈ నేపథ్యంలో ఇంట్రానాసల్ కొవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలను తాము చేపట్టనున్నట్టు భారత్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలావుండగా, ముక్కు ద్వారా టీకాపై భారత్ బయోటెక్.. వాషింగ్టన్ యూనివర్సిటీతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అమెరికా, జపాన్, ఐరోపా మినహా మిగతా దేశాల్లో నాజిల్ స్ప్రే వ్యాక్సిన్ సరఫరాకు అనుమతి తీసుకుంది.