AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egypt train Accident: ఈజిప్టులో పట్టాలు తప్పిన రైలు.. 11 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు

ఉత్తర ఆఫ్రికాలోని ఈజిప్ట్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు చనిపోయారు. ఈజిప్ట్‌లోని స్వాల్ యూబియా ప్రాంతంలో ఓ ప్యాసింజర్‌ ట్రైన్ పట్టాలు తప్పింది.

Egypt train Accident: ఈజిప్టులో పట్టాలు తప్పిన రైలు.. 11 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు
Egypt Train Accident
Balaraju Goud
|

Updated on: Apr 19, 2021 | 8:07 AM

Share

వారం పది రోజు వ్యవధిలోనే మరో ఘోర ప్రమాదం. ఒకరిద్దరు కాదు 11మంది మృత్యువాత పడ్డారు. గమ్య స్థానాలకు చేరాల్సిన వాళ్లు కాస్తా .మృత్యు ఒడికి చేరారు. ఆదివారం కైరోకు ఉత్తరాన జరిగిన రైలు ప్రమాదం జరిగిందని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది

ఉత్తర ఆఫ్రికాలోని ఈజిప్ట్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు చనిపోయారు. ఈజిప్ట్‌లోని స్వాల్ యూబియా ప్రాంతంలో ఓ ప్యాసింజర్‌ ట్రైన్ పట్టాలు తప్పింది. అంతే రైలులో ప్రయాణిస్తున్న వారిలో 11 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో 100మందిపైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 60 అంబులెన్సుల్లో స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కూడా మరికొందరి పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు.

ప్రమాదానికి గురైన రైలు ఈజిప్టు రాజధాని కెయిరో నుంచి నైలు డెల్టా నగరానికి బయల్దేరింది. ఈక్రమంలో స్వాల్ యూబియా ప్రాంతానికి చేరుకుంటుండగా వరుసగా నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. చాలా మంది ప్రయాణికులు బోగీల్లో చిక్కుకున్నట్లు అధికారులు వివరించారు. సహాయక చర్యలను చేపట్టి బోగీల్లో చిక్కుకున్న వాళ్లను బయటకు తీశారు. అయితే ఈ ప్రమాదం జరగటానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అధ్యక్షుడు అబ్దేల్-ఫట్టా అల్-సిసి ఆదివారం మిలిటరీ ఇంజనీరింగ్ అథారిటీని విచారించి, తాజా సంఘటనపై దర్యాప్తు జరిపాలని ఆదేశించారు.

సరిగ్గా వారం రోజుల క్రితం ఈజిప్ట్‌లోని మిన్యా ఆల్‌క్వామా ప్రాంతంలో రైలు పట్టాలు తప్పిన ఒక టన్నెల్‌ని ఢీకొంది. ఆ ప్రమాదంలో 20మంది చనిపోగా, 199 మంది గాయపడ్డారు.

Read Also…  అసోం మాజీ ముఖ్యమంత్రి భూమిధర్​బర్మన్ కన్నుమూత.. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం