శ్రీశైలం ప్రాజక్టులోకి భారీగా వరదనీరు.. నమోదవుతోన్న కొత్త రికార్డులు

|

Sep 27, 2020 | 11:01 AM

శ్రీశైలం జలాశయానికి 2009 తర్వాత రికార్డు స్థాయిలో వరదనీటి ప్రవాహం వస్తోంది. జలాశయంలోని 12 క్రస్ట్ గేట్లలో 10 గేట్లు 25 అడుగులు మేర ఎత్తివేశారు. దీంతో ఈ సంవత్సరంలో శ్రీశైలం డ్యామ్ జలాశయం గేట్లు నాలుగోసారి ఎత్తినట్లైంది. కృష్ణమ్మ పరవళ్ళు త్రొక్కుతూ శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టులో కలిసేందుకు బిరబిరా పరుగులెడుతోంది. శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లోగా 5, 19,713 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 5, 66, 450 క్యూసెక్కుల వరదనీరు […]

శ్రీశైలం ప్రాజక్టులోకి భారీగా వరదనీరు.. నమోదవుతోన్న కొత్త రికార్డులు
తాజా వివాదంతో వ్యవహారం ఢిల్లీ వరకు వెళ్లింది. సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే కృష్ణా బోర్డుకు మరోసారి ఫిర్యాదు చేసింది తెలంగాణ సర్కార్‌. వెంటనే ఏపీ ప్రాజెక్ట్‌లపై పరిశీలన చేయాలని డిమాండ్‌ చేస్తోంది.
Follow us on

శ్రీశైలం జలాశయానికి 2009 తర్వాత రికార్డు స్థాయిలో వరదనీటి ప్రవాహం వస్తోంది. జలాశయంలోని 12 క్రస్ట్ గేట్లలో 10 గేట్లు 25 అడుగులు మేర ఎత్తివేశారు. దీంతో ఈ సంవత్సరంలో శ్రీశైలం డ్యామ్ జలాశయం గేట్లు నాలుగోసారి ఎత్తినట్లైంది. కృష్ణమ్మ పరవళ్ళు త్రొక్కుతూ శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టులో కలిసేందుకు బిరబిరా పరుగులెడుతోంది. శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లోగా 5, 19,713 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 5, 66, 450 క్యూసెక్కుల వరదనీరు దిగువకు వదులుతున్నారు.

ఏపీ పవర్ హౌస్ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 29 వేల 325 క్యూసెక్కుల నీటిని వినియోగించుకున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి మొత్తంగా చూసుకుంటే అవుట్ ఫ్లో 5, 95, 775 క్యూసెక్కుల వరదనీరు విడుదల అవుతుంది. జలాశయం పూర్తి స్దాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 210.9946 టిఎంసిలుగా గరిష్ఠ స్దాయికి చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 884.20 అడుగులుగా ఉంది.