రెండేళ్ల ఒత్తిడి ఫలితమే హఫీజ్ అరెస్ట్.. ట్రంప్ ట్వీట్

| Edited By: Pardhasaradhi Peri

Jul 18, 2019 | 7:08 AM

దేశాన్ని వణికించిన ముంబై బాంబు ప్రేలుళ్ల ప్రధాన సూత్రధారి టెర్రరిస్ట్ హఫీజ్ సయిద్ అరెస్ట్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. పదేళ్ల సుధీర్ఘమైన అన్వేషణ అనంతరం హఫీజ్ పాకిస్తాన్‌లో అరెస్ట్ అయ్యాడు. తమ రెండేళ్ల తీవ్ర ఒత్తిడితోనే ఈ అరెస్ట్ సాధ్యమైందంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా హఫీజ్ సయిద్‌పై ఐక్యరాజ్యసమితి ముద్రవేసింది. ఎప్పటినుంచో అమెరికా సైతం ఉగ్రవాదంపై ఉక్కపాదం మోపాలని గట్టిగా ఒత్తిడి తెస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోపాక్ పోలీసులు హఫీజ్‌ను […]

రెండేళ్ల ఒత్తిడి ఫలితమే హఫీజ్ అరెస్ట్.. ట్రంప్ ట్వీట్
Follow us on

దేశాన్ని వణికించిన ముంబై బాంబు ప్రేలుళ్ల ప్రధాన సూత్రధారి టెర్రరిస్ట్ హఫీజ్ సయిద్ అరెస్ట్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. పదేళ్ల సుధీర్ఘమైన అన్వేషణ అనంతరం హఫీజ్ పాకిస్తాన్‌లో అరెస్ట్ అయ్యాడు. తమ రెండేళ్ల తీవ్ర ఒత్తిడితోనే ఈ అరెస్ట్ సాధ్యమైందంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.

అంతర్జాతీయ ఉగ్రవాదిగా హఫీజ్ సయిద్‌పై ఐక్యరాజ్యసమితి ముద్రవేసింది. ఎప్పటినుంచో అమెరికా సైతం ఉగ్రవాదంపై ఉక్కపాదం మోపాలని గట్టిగా ఒత్తిడి తెస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోపాక్ పోలీసులు హఫీజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటన ముందు హఫీజ్ అరెస్ట్ చేయడం గమనార్హం.