23 ఏళ్లకు దొరికిన వజ్రాల స్మగ్లర్ హరీష్ కల్యాణ్

ఇరవై ఏళ్లకు పైగా తప్పించుకు తిరుగుతున్న వజ్రాల వ్యాపారిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. వజ్రాల స్మగ్లింగ్ చేస్తూ వందల కేసుల్లో నిందితుడుగా ఉన్న హరీష్ కల్యాణ్ ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు

Follow us

|

Updated on: Jul 17, 2020 | 4:40 PM

ఇరవై ఏళ్లకు పైగా తప్పించుకు తిరుగుతున్న వజ్రాల వ్యాపారిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. వజ్రాల స్మగ్లింగ్ చేస్తూ వందల కేసుల్లో నిందితుడుగా ఉన్న హరీష్ కల్యాణ్ ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు

వజ్రాలు, బంగారం స్మగ్లింగ్ చేసి పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ బడా స్మగ్లర్ ను 23 ఏళ్ల తర్వాత ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై నగరానికి చెందిన హరీష్ కల్యాణ్ దాస్ భావసర్ అలియాస్ పరేష్ ఝావేరీ (53)వజ్రాలు, బంగారం స్మగ్లర్. అక్రమ దందా నిర్వహిస్తూ హరీష్ కల్యాణ్ ప్రభుత్వానికి 130కోట్ల రూపాయల పన్ను ఎగవేశాడు. దీంతో 1997లో ఇతనిపై మొదటి కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు గాలింపు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసులకు చిక్కకుండా రకరకాల వేషాల్లో తప్పించుకు తిరుగుతున్నాడు. ఇంతకాలం అతనిపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హరీష్ కల్యాణ్ సింగపూర్ నుంచి ముడి బంగారం, వజ్రాలను దిగుమతి చేసుకొనేవాడని పోలీసులు తెలిపారు. దీంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న స్మగ్లర్ హరీష్ ను అరెస్ట్ చేశామని ముంబై పోలీసులు తెలిపారు. హరీష్ పై బంగారం, వజ్రాల స్మగ్లింగ్ కేసు నమోదు చేశామని వెల్లడించారు.

Latest Articles
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..

'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్

దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్

సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు

STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్

ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే

వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..

తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..