డేట్ ఫిక్స్.. టైం ఫిక్స్.. ఇక చెప్పడమే ఆలస్యం

తెలంగాణ మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. ఇవాళ ఉదయం 11.30లకు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రివర్గంలో మహమూద్ అలీకి హోంశాఖ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రశాంత్ రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకరరావుతో పాటు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డిలను కూడా ఇవాళ ఉదయం అందుబాటులో ఉండాలని సీఎం కార్యాలయం నుంచి ఫోన్ అందింది. కాగా.. […]

డేట్ ఫిక్స్.. టైం ఫిక్స్.. ఇక చెప్పడమే ఆలస్యం

Edited By:

Updated on: Feb 19, 2019 | 8:00 AM

తెలంగాణ మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. ఇవాళ ఉదయం 11.30లకు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రివర్గంలో మహమూద్ అలీకి హోంశాఖ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రశాంత్ రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకరరావుతో పాటు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డిలను కూడా ఇవాళ ఉదయం అందుబాటులో ఉండాలని సీఎం కార్యాలయం నుంచి ఫోన్ అందింది. కాగా.. మరికొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. సీఎం ముందుగానే ప్రకటించినట్లు ఆరుగురు కొత్త మంత్రులను తీసుకోనున్నట్లు సమాచారం.