ఫొని ఎఫెక్ట్: ఎవరెస్ట్ బేస్‌ క్యాంపులో ఎగిరిపోయిన టెంట్లు

ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో బీభత్సాన్ని సృష్టించిన ఫొని తుఫాను.. ప్రస్తుతం బంగ్లాదేశ్ వైపుగా ప్రయాణించి క్రమేణా బలహీనపడింది. ఈ క్రమంలో పర్వతారోహకులపై ఫొని గట్టి ప్రభావాన్ని చూపింది. హిమాలయాల్లో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంపులో 20 టెంట్లు ఫొని తుఫానులో ఎగిరిపోయాయి. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ట్రెక్కింగ్ ఏజెన్సీలు, సపోర్టింగ్ స్టాఫ్‌లు పర్వతారోహకులకు రక్షణ కల్పించాలంటూ ఆ దేశం కోరింది. ‘‘భీకర గాలులకు హిమాలయాల్లోని కొన్ని క్యాంపులు నాశనం అయ్యాయి. అయితే పర్వాతారోహకులు, […]

ఫొని ఎఫెక్ట్: ఎవరెస్ట్ బేస్‌ క్యాంపులో ఎగిరిపోయిన టెంట్లు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 04, 2019 | 4:06 PM

ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో బీభత్సాన్ని సృష్టించిన ఫొని తుఫాను.. ప్రస్తుతం బంగ్లాదేశ్ వైపుగా ప్రయాణించి క్రమేణా బలహీనపడింది. ఈ క్రమంలో పర్వతారోహకులపై ఫొని గట్టి ప్రభావాన్ని చూపింది. హిమాలయాల్లో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంపులో 20 టెంట్లు ఫొని తుఫానులో ఎగిరిపోయాయి. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ట్రెక్కింగ్ ఏజెన్సీలు, సపోర్టింగ్ స్టాఫ్‌లు పర్వతారోహకులకు రక్షణ కల్పించాలంటూ ఆ దేశం కోరింది.

‘‘భీకర గాలులకు హిమాలయాల్లోని కొన్ని క్యాంపులు నాశనం అయ్యాయి. అయితే పర్వాతారోహకులు, వారికి సహకరించే వారు సురక్షితంగా ఉన్నారు’’ అంటూ పర్వతారోహణ విభాగం డైరక్టర్ మైరా ఆచార్య అన్నారు. పర్వతారోహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా అన్ని ఏజెన్సీలను కోరినట్లు ఆయన వెల్లడించారు. అలాగే వాతావరణం సాధారణ స్థితికి వచ్చేవరకు పర్వాతాలను ఎక్కేందుకు అనుమతిని రద్దు చేసినట్లు ఆచార్య తెలిపారు. కాగా భారత్‌లో ఫొని తుఫాను వలన 10మంది మృతి చెందిన విషయం తెలిసిందే.