సహచరుల్ని పొట్టనబెట్టుకున్న సీఆర్‌పీఎఫ్ జవాన్

| Edited By:

Mar 21, 2019 | 9:39 AM

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని ఉదమ్‌పూర్ ఓ సీఆర్పీఎఫ్‌ జవాన్‌ రెచ్చిపోయాడు. ముగ్గురు సహచర జవాన్లు వాగ్వాదానికి దిగడంతో వారిని తన సర్వీసు రైఫిల్‌తో కాల్చిచంపాడు. సీఆర్పీఎఫ్‌ 187వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌ అజిత్‌ కుమార్‌ కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ముగ్గురు సహచరులకు అజిత్‌తో వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన అజిత్‌ తన తుపాకీతో ముగ్గురు సహచరుల్ని కాల్చి, తానూ ఆత్మహత్యకు యత్నించాడు. అధికారులు వీరిని హుటాహుటిన ఆసుపత్రికి […]

సహచరుల్ని పొట్టనబెట్టుకున్న సీఆర్‌పీఎఫ్ జవాన్
Follow us on

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని ఉదమ్‌పూర్ ఓ సీఆర్పీఎఫ్‌ జవాన్‌ రెచ్చిపోయాడు. ముగ్గురు సహచర జవాన్లు వాగ్వాదానికి దిగడంతో వారిని తన సర్వీసు రైఫిల్‌తో కాల్చిచంపాడు. సీఆర్పీఎఫ్‌ 187వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌ అజిత్‌ కుమార్‌ కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ముగ్గురు సహచరులకు అజిత్‌తో వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన అజిత్‌ తన తుపాకీతో ముగ్గురు సహచరుల్ని కాల్చి, తానూ ఆత్మహత్యకు యత్నించాడు. అధికారులు వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, ముగ్గురు జవాన్లు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దాడిలో ఝున్‌ఝునూకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆర్ పొకార్మల్, ఢిల్లీకి చెందిన యోగేంద్ర శర్మ, హర్మానాకు చెందిన ఉమెద్ సింగ్ మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. దాడికి పాల్పడిన కుమార్ ఆరోగ్యం విషమం ఉన్నట్లు తెలిపారు.