గ్రామీణ ప్రాంతాలకు ముప్పు.. హోంశాఖ వార్నింగ్

|

Apr 28, 2020 | 6:54 PM

దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు కరోనా వైరస్ ముప్పు ఇంకా పొంచి వుందని కేంద్ర హోం శాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు రూపొందించిన ఓ ప్రత్యేక నివేదిక ఆధారంగా రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. ముప్పు నివారణకు తీసుకోవాల్సిన చర్యలను కూడా నిర్దేశించింది హోం శాఖ.

గ్రామీణ ప్రాంతాలకు ముప్పు.. హోంశాఖ వార్నింగ్
Follow us on

దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు కరోనా వైరస్ ముప్పు ఇంకా పొంచి వుందని కేంద్ర హోం శాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు రూపొందించిన ఓ ప్రత్యేక నివేదిక ఆధారంగా రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. ముప్పు నివారణకు తీసుకోవాల్సిన చర్యలను కూడా నిర్దేశించింది హోం శాఖ.

దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించిన తర్వాత గత నెల 15 రోజులుగా వైరస్ ప్రభావం కేవలం పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ శాతం కనిపించింది. దానికి కారణం విదేశాల నుంచి ప్రయాణికులు ఎక్కువగా నగర, పట్టణ ప్రాంతాలకు రావడం వల్లనే కరోనా వైరస్ వ్యాప్తి చెందడం జరిగిందని అంతా భావించారు. అదే సమయంలో ఢిల్లీ నిజాముద్దీన్ ఏరియాలో జరిగిన సదస్సు కూడా దేశంలో కరోనా వైరస్ ప్రబలడానికి కారణం అయింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడ కరుణ వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయినప్పటికీ.. పట్టణ ప్రాంతాల్లోనే అధిక సంఖ్యలో కేసులు రికార్డయ్యాయి.

పట్టణాలు, నగరాల్లో విస్తరించిన కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ప్రణాళికతో లాక్ డౌన్ అమల్లోకి తెచ్చాయి. ఈ కారణంగా దేశంలో కరోనా వైరస్ రెండో దశ దాటి.. మూడో దశలోకి ప్రవేశించకుండా అడ్డుకోగలిగాము. మూడో దశలోకి కరోనా వైరస్ వ్యాప్తి చేరుకుంటే.. దాన్ని నియంత్రించడం మనలాంటి జన సాంద్రత అధికంగా ఉన్న దేశాలలో సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందే హెచ్చరించింది. దానికి తోడు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పక్క చర్యలతో, పకడ్బందీ విధానాలతో కరోనా వైరస్ వ్యాప్తిని చాలా మటుకు అడ్డుకోగలిగింది. దానికి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలలో స్థానిక ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు కూడా ఎంతో దోహదపడ్డాయి.

అయితే కరోనా వైరస్ ప్రమాదం ఇంకా పూర్తిస్థాయిలో తొలగి పోలేదని కేంద్ర హోం శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం నగరాలు, పట్టణాలకు అపరిమితమైన కరోనా వైరస్ వ్యాప్తి మునుముందు గ్రామీణ భారతానికి విస్తరించే ప్రమాదం కనిపిస్తుందని హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఓ నివేదిక రూపొందించారు. దీనికి ప్రధానంగా ఆయన చెబుతున్న కారణం వలస కార్మికులు గత 35 రోజులుగా దేశంలో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో వలస కార్మికుల సమస్యలు వర్ణనాతీతంగా తయారయ్యాయి. చాలాచోట్ల వేలాది కిలోమీటర్లు దూరం కాలి నడకన ప్రయాణించి చేసి తమ స్వస్థలాలకు చేరుకోవాలని వలస కార్మికులు చేస్తున్న ప్రయత్నాలు చూస్తున్న వారిని కంటతడి పెట్టించాయి.

వలస కార్మికుల కన్నీటి కష్టాలకు స్పందించిన ప్రభుత్వాలు వారిని.. వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్దిష్టమైన సూచనలు జారీ చేసింది. కానీ ఇప్పుడు ఈ వలస కార్మికుల ప్రయాణాలు గ్రామీణ భారతానికి కరోనా వైరస్ ముప్పును వ్యాపింప చేసే అవకాశాలున్నాయని హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తన నివేదికలో పేర్కొన్నారు. ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ఇండోర్ వంటి పెద్ద నగరాల నుంచి వలస కార్మికులు తమ స్వస్థలాలకు, గ్రామీణ ప్రాంతాలకు చేరుకోవడం ఆయా ప్రాంతాలకు కరోనా వైరస్ ముప్పును తరలించే ప్రమాదం ఉందని తన నివేదికలో వివరించారు.

వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లినప్పటికీ వారిని క్వారెంటైన్‌లో ఉంచడం ప్రస్తుతానికి స్థానిక ప్రభుత్వాల కర్తవ్యమని, తద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని చాలా మటుకు నియంత్రించవచ్చని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అయితే ఈ సూచనను వలస కార్మికుల కుటుంబాలు ఏ మేరకు పాటిస్తాయి అన్నదిప్పుడు చర్చనీయాంశం. నగర ప్రాంతాలనుంచి గ్రామీణ భారతానికి వలస వచ్చే కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న టైం సూచనలను తప్పనిసరిగా పాటిస్తేనే గ్రామీణ భారతం కరోనా వైరస్ ముప్పు నుంచి తప్పించుకునే అవకాశం ఉందని హోం శాఖ తెలియజేస్తోంది.