తగ్గని కరోనా తీవ్రత.. ప్రపంచవ్యాప్తంగా మూడున్నరకోట్ల కేసులు

|

Sep 27, 2020 | 10:35 AM

దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 3,30,46,292 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఇప్పటి వరకు 9,98,275 మంది మృతి చెందారు. కోలుకున్న వాళ్లు 2,44,01,389 మంది. అటు, భారత్‌లోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్న (శనివారం) 88,600 కరోనా కేసులు నమోదు కాగా, 1,124 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 59,92,533 కు చేరాయి. భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో 94,503 మంది […]

తగ్గని కరోనా తీవ్రత.. ప్రపంచవ్యాప్తంగా మూడున్నరకోట్ల కేసులు
Follow us on

దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 3,30,46,292 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఇప్పటి వరకు 9,98,275 మంది మృతి చెందారు. కోలుకున్న వాళ్లు 2,44,01,389 మంది. అటు, భారత్‌లోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్న (శనివారం) 88,600 కరోనా కేసులు నమోదు కాగా, 1,124 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 59,92,533 కు చేరాయి. భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో 94,503 మంది మృతి చెందగా, యాక్టివ్‌ కేసులు 9,56,402 ఉన్నాయి. ఈ వైరస్ బారినపడి కోలుకుని డిశ్చార్జ్ అయిన వాళ్లు ఇప్పటి వరకు దేశంలో 49,41,628 మంది ఉన్నారు. అటు, అగ్రదేశం అమెరికా సహా ప్రపంచ దేశాల్లోనూ కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది.

అటు, అగ్రదేశం అమెరికా సహా ప్రపంచ దేశాల్లోనూ కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. గల్ఫ్‌ను కూడా కరోనా వణికిస్తోంది. ముఖ్యంగా యూఏఈలో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. గత నాలుగు రోజులుగా వరుసగా వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య 90 వేల మార్కును దాటింది. శనివారం దేశవ్యాప్తంగా 98,168 కొవిడ్ టెస్టులు నిర్వహించగా 1,078 మందికి పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 90,618కు చేరింది.