AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవదేవుని బ్రహ్మోత్సవాలు ఈరాత్రితో పరిసమాప్తం

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున స్వామివారికి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం, స్నపన తిరుమంజనాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం ఆరు గంటలకు శ్రీవారి ఆలయంలోని తాత్కాలిక లఘు పుష్కరిణిలో ఏకాంతంగా చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజావరోహణం ఉంటుంది. ధ్వజావరోహణంతో దేవదేవుని బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. ఈ నెల నుంచి 19 నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు […]

దేవదేవుని బ్రహ్మోత్సవాలు ఈరాత్రితో పరిసమాప్తం
Venkata Narayana
|

Updated on: Sep 27, 2020 | 8:03 AM

Share

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున స్వామివారికి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం, స్నపన తిరుమంజనాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం ఆరు గంటలకు శ్రీవారి ఆలయంలోని తాత్కాలిక లఘు పుష్కరిణిలో ఏకాంతంగా చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజావరోహణం ఉంటుంది.

ధ్వజావరోహణంతో దేవదేవుని బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. ఈ నెల నుంచి 19 నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో టీటీడీ బోర్డు ఆల‌యంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించింది. గతంలోలా కాకుండా వాహన సేవల సమయాల్లోనూ మార్పులు చేశారు. ఉదయం 9 నుంచి 10 గంటలు, రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య స్వామివారి వాహన సేవలు జరిగాయి.

Follow Us