సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు పగటికల మాత్రమేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. రాష్ట్రంలో సమస్యలను వదిలిపెట్టి కేసీఆర్ మాత్రం తీర్థయాత్రలు చేసుకుంటున్నారని శ్రవణ్ మండిపడ్డారు. తెలంగాణలో కమ్యూనిస్టుల ఊసెత్తని కేసీఆర్ ఇప్పుడు కేరళ కమ్యూనిస్టులతో ఎందుకు జతకట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని విమర్శించారు. అంతేకాదు జాతీయ స్థాయిలో కేసీఆర్ ను ఎవ్వరూ నమ్మడం లేదని, ఆయనను అంతా మోదీ ఏజెంట్ అని భావిస్తున్నారని అన్నారు. కేసీఆర్ చేసే యాత్రల్లో ఎలాంటి రాజకీయం లేదని అవి కేవలం తీర్థ యాత్రలేనని ఎద్దేవా చేశారు. గతంలో పూరీ ఆలయాన్ని సైతం ఫెడరల్ ఫ్రంట్ సాకుతో దర్శించుకున్నారని శ్రవణ్ విమర్శించారు. మమతా బెనర్జీ, బిజూ పట్నాయక్ వంటి నేతలు సైతం కేసీఆర్ మాటలు నమ్మేందుకు సిద్ధంగా లేరని అన్నారు.