హుజూర్ నగర్‌లో భారీ వర్షం…సీఎం కేసీఆర్ సభ రద్దు
తెలంగాణాలో ఉత్కంఠ రేపుతున్న హుజూర్‌నగర్ ఎన్నికల సమరంలో గెలుపు ఎవరిదో అనే లెక్కలు తేలడం లేదు. టీఆర్ఎస్ నేత లు మాత్రం తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం హుజూర్‌నగర్‌లో బహిరంగ సభ జరపాలని నిర్ణయించారు. దీనికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరుకావాల్సి ఉంది. అయితే భారీ వర్షం కారణంగా సీఎం సభ రద్దయింది. రెండు గంటలుగా ఏకధాటిగా వర్షం కురవడంతో సీఎం సభను రద్దు చేశారు. భారీ వర్షం కారణంగా […]
తెలంగాణాలో ఉత్కంఠ రేపుతున్న హుజూర్‌నగర్ ఎన్నికల సమరంలో గెలుపు ఎవరిదో అనే లెక్కలు తేలడం లేదు. టీఆర్ఎస్ నేత లు మాత్రం తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం హుజూర్‌నగర్‌లో బహిరంగ సభ జరపాలని నిర్ణయించారు. దీనికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరుకావాల్సి ఉంది. అయితే భారీ వర్షం కారణంగా సీఎం సభ రద్దయింది. రెండు గంటలుగా ఏకధాటిగా వర్షం కురవడంతో సీఎం సభను రద్దు చేశారు. భారీ వర్షం కారణంగా సీఎం ప్రయాణించే హెలీకాప్టర్‌కు ఏవియేషన్ అధికారులు అనుమతి నిరాకరించారు. భారీ వర్షం, పిడుగులు పడే అవకాశాలున్నందున అనుమతి ఇవ్వలేదని ఏవియేషన్ డైరెక్టర్ భరత్‌రెడ్డి తెలిపారు. సీఎం సభకు అప్పటికే భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు నిరాశతో వెనుతిరగాల్సివచ్చింది.