Breaking on Coronavirus: తెలుగు రాష్ట్రాలకు చైనా విద్యార్థులు

|

Feb 18, 2020 | 5:58 PM

గత పదిహేను రోజులుగా ఢిల్లీలో పరిశీలనలో వున్న చైనా నుంచి తిరిగి వచ్చిన తెలుగు విద్యార్థులు ఎట్టకేలకు వారి వారి స్వస్థలాలకు బయలు దేరారు. వీరిలో కరోనా వైరస్ నెగెటివ్ రిపోర్ట్స్ రావడంతో వారిని వారి ఇళ్ళకు వెళ్ళేందుకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Breaking on Coronavirus: తెలుగు రాష్ట్రాలకు చైనా విద్యార్థులు
Follow us on

China students left for Telugu states from New Delhi: చైనాలోని వూహన్ నగరంలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాలకు బయలుదేరారు. కరోనా వైరస్ బారిన పడిన వూహన్ నగరంలో చదువుకుంటూ.. సెలవుల కోసం ఇండియా వచ్చేందుకు రెడీ అయిన తెలుగు విద్యార్థులు గత 15-20 రోజులుగా త్రిశంకు నరకంలో వున్న సంగతి తెలిసిందే. వూహన్ ఎయిర్‌పోర్టులో రోజుల తరబడి పడుగాపులు కాచిన తర్వాత భారత ప్రభుత్వం చొరవతో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న తెలుగు విద్యార్థులు గత పదిహేను రోజులుగా ప్రత్యేక హాస్పిటల్లో ఆబ్జర్వేషన్ వున్నారు.

తాజాగా వారందరికీ కరోనా వైరస్ నెగెటివ్ రావడంతో వారిని తెలుగు రాష్ట్రాల్లోని వారి వారి సొంత ప్రాంతాలకు పంపించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాలకు బయలు దేరారు చైనా విద్యార్థులు. వూహన్ నగరం నుంచి వచ్చిన విద్యార్థులను కరోనా అనుమానంతో 15 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచారు. 15 రోజుల అబ్జర్వేషన్ అనంతరం వారిని స్వస్థలాలకు అనుమతించారు. దాంతో మంగళవారం మధ్యాహ్నం వారంతా స్వస్థలాలకు బయలుదేరారు. వీరిలో ఎవరికీ కోవిడ్-19 లేదని ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ.. వీరి పట్ల ఎలాంటి వివక్ష చూపరాదని ఆదేశాలు జారీ చేసింది.

Also read: Purandeshwari strong warning to political opponents

ఢిల్లీ నుంచి విశాఖ, హైదరాబాద్, విజయవాడకు విమానాల్లో బయలు దేరిన 23 మంది తెలుగువిద్యార్థులు కొద్దిసేపటి క్రితం వారి వారి స్వస్థలాలకు చేరుకున్నారని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.