Breaking News
  • అమరావతి: ఏపిలో ఒకే రోజు 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం 40 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య.
  • మద్యం పిచ్చి కుదిరేనా: డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌తో వచ్చే వారికి మద్యం సరఫరాకు కేరళ సర్కార్‌ నిర్ణయం, తప్పుపట్టిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, ఎర్రగడ్డ ఆస్పత్రికి క్యూకట్టిన బాధితులు, వందల సంఖ్యలో ఓపీ కేసులు.
  • కరోనాకు 50 మంది డాక్టర్లు బలి: ఒక్క ఇటలీలోనే కరోనాకు 50 మంది డాక్టర్లు చనిపోయినట్టు డాక్టర్ల సంఘం ప్రకటన.
  • అమెరికా కంటే భారత్‌లోనే కరోనా మరణాల రేటు అధికం, అమెరికాలో 1 పాయింట్‌ 74 శాతం ఉంటే ఇండియాలో 2 పాయింట్‌ 70 శాతం ప్రపంచ సగటు 4 పాయింట్‌ 69 శాతం.
  • ఢిల్లీ లోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మతపరమైన ప్రార్దన కు వెళ్లి వచ్చిన వారిలో... 15 మందిని గుర్తించిన మియాపూర్ పోలీసులు. 10 మందిని టెస్టుల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలింపు. ఈ నెల 13 న ఢిల్లీ వెళ్లి 15 వ తేదీన తిరిగి వచ్చిన మియాపూర్ హఫీజ్ పేట్ కు చెందిన వాసులు..

Purandeshwari anger: నిందలేస్తే ఊరుకోను.. పురందేశ్వరి స్ట్రాంగ్ వార్నింగ్

రాజకీయ ప్రత్యర్థులపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి నిప్పులు గక్కారు. కేంద్రం కేటాయింపులపై క్లారిటీ లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదన్నారీ ఎన్టీఆర్ తనయ.
purandeshwari strong warning to opponents, Purandeshwari anger: నిందలేస్తే ఊరుకోను.. పురందేశ్వరి స్ట్రాంగ్ వార్నింగ్

Purandeshwari strong warning to those who blames BJP: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు గక్కారు. నిధుల కేటాయింపు వివరాలు లేకుండా.. కేంద్రం నిధులివ్వడం లేదంటూ నిరాధార ఆరోపణలతో మీడియాకు ఎక్కితే సహించేది లేదని ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో అనేక పథకాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఆమె అంటున్నారు. నెల్లూరులో మంగళవారం ఆమె పర్యటించారు. మీడియాతో మాట్లాడారు.

ఏపీలోని జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్లనే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదన్నారు పురందేశ్వరి. పోలవరం పనులు సక్రమంగా సాగడం లేదని, దానికి కారణం జగన్ ప్రభుత్వ విధానాలేనని ఆమె ఆరోపించారు. మూడు రాజధానుల నిర్ణయం వల్ల ఏపీకి నష్టం కలిగిందంటున్నారు పురందేశ్వరి. నిర్మాణ రంగం కుదేలైందని, కూలీల జీవితాలు వీధినపడ్డాయని పురందేశ్వరి ఆరరోపించారు.

శాసనమండలి రద్దు చేయకూడదంటూ ఇపుడు నానా యాగీ చేస్తున్న చంద్రబాబు గతంలో రద్దు చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు పురందేశ్వరి. టీడీపీ, వైసీపీలు స్వలాభాపేక్షతో వ్యవహరిస్తున్నాయని అన్నారామె. రెండు పార్టీల విధానాలను, చర్యలను ప్రజలను హర్షించరన్నారు. బీజేపీలో ధృడమైన నాయకత్వం ఉండి, గట్టి నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని చెబుతున్నారు పురందేశ్వరి. సీఏఏ విషయంలో బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, వైసీపీ, టీడీపీలతో బీజేపీకి ఎలాంటి పొత్తు ఉండదని, జనసేనతోనే కలిసి పనిచేస్తామని పురందేశ్వరి క్లారిటీ ఇచ్చారు.

Also read: Piyush Goel says ten times more funds to South Central Railway

Related Tags