అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 5గంటలవరకు పోలింగ్ జరగనుంది.