పచ్చని పర్యావరణం విచ్చిన్నమవుతున్నా.. ప్రభుత్వాలు నోరు మెదపడం లేదు. ముంబైలో మెట్రో కార్ షెడ్ నిర్మించడం కోసం ఆరే కాలనీలో చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. ఇప్పటికే చెట్ల నరికివేతను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న 20 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. చెట్ల నరికివేతపై ముంబై హైకోర్టులో దాఖలైన నాలుగు పిటిషన్లను కోర్టు కొట్టివేసిన కొన్ని గంటల్లోనే.. అంటే శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చెట్లను నేలకూల్చడం ప్రారంభించారు.
చెట్ల నరికివేతపై నిరసనలు
ముంబైలో నిర్మిస్తున్న మెట్రో కార్ షెడ్ నిర్మించడం కోసం ఆరే కాలనీలో చెట్లను తొలగించాలని మహా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు సైతం జరుగుతున్నాయి. ఇప్పటికే ముంబై హైకోర్టులో ఇదే అంశానికి సంబంధించి నాలుగు పిటిషన్లు దాఖలయ్యయి. అయితే వీటిపై శుక్రవారం విచారణ చేపట్టిన కోర్టు వాటిని కొట్టివేసింది. ఈ అంశం సుప్రీం కోర్టులోనూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్నందున దీన్ని విచారించలేమంటూ కోర్టు పేర్కొంది. ఈ ప్రక్రియ సాగిన కొన్ని గంటల్లోనే ఆరే ప్రాంతానికి భారీగా జేసీబీలు,బుల్‌డ్రోజర్లు చేరుకున్నాయి. దీన్ని గమనించి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ కొందమంది యాక్టివిస్టులు చెట్ల నరికివేతను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు వారిని అక్కడినుంచి బలవంతంగా తరలించారు. వీరిలో 20 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆరే ప్రాంతంలో 144 సెక్షన్ విధించి ఆ ప్రాంతానికి ఎవరూ రాకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. అయితే ఇప్పటివరకు 20 మందిని అరెస్టుచేసినట్టు తెలుస్తున్నా.. మొత్తం 38మంది మీద ఎఫ్ఆర్ఆర్ కూడా నమోదు చేసినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. అరెస్టయిన వారిని శనివారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
ముంబైలో ఆరే ప్రాంతంలో చెట్ల నరికివేతను అడ్డకున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేశారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తాము చట్టాన్ని ఎక్కడా ఉల్లంఘించకపోయినా.. తమను ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా అర్ధం కాలేదని , పోలీసులు పిచ్చిగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శివసేన పార్టీకి చెందిన ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు . మెట్రోస్టేషన్ కార్ షెడ్ కోసం చెట్లను నరికివేస్తున్నట్టుగా ముంబై గ్రేటర్ మన్సిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం అక్టోబర్ 4 వతేదీన తమ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. ఈ విధంగా వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన 15 రోజుల్లో చెట్లను తొలగించే అవకాశముంది. అయితే కార్పోరేషన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే నరికివేతను ప్రారంభించారు. శనివారం కోర్టు తమ పిటిషన్లు కొట్టివేయడం, ఆ తర్వాత కోర్టుకు దసరా సెలవులు కావడంతో తాము న్యాయ పోరాటానికి ఎలా వెళ్లగలమని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కోర్టు సెలవులు పూర్తయ్యే నాటికి పచ్చని అడవి మొత్తం కనిపించకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని భిడే మాట్లాడుతూ చెట్ల నరికివేతకు సంబంధించి ట్రీ ఆర్డర్ సెప్టెంబర్ 13న జారీ చేయబడిందని తెలిపారు.
ప్రతిఘటించాలంటున్న నేతలు
చెట్ల నరికివేతపై కోర్టు తమ పిటిషన్లును కొట్టివేయడంతో ఆరే ప్రాంతంలో ఏదో జరగబోతుందని ముందే ఊహించిన కార్యకర్తలు రాత్రి సమయంలో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే వారిని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. చెట్ల నరికివేతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరికొంతమంది కార్యకర్తలు అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. చెట్లను తొలగించడానికి ప్రభుత్వానికి అంత తొందరెందుకు అంటూ వారు ప్రశ్నించారు. అందరికీ ప్రాణం పోసే పచ్చని చెట్లు నరికివేయడం చాల బాధగా ఉందని, ప్రభుత్వమే ఒకవైపు చెట్లు నాటాలని చెబుతూ.. మరోవైపు ఈ విధంగా నరికివేయడం ఏమిటని వారు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే చెట్ల నరికివేతకు సంబంధించిన వీడియో హల్‌చల్ చేసిన తర్వాత గుజరాత్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ, శివసేన నేత ఆదిత్య ఠాక్రే సైతం.. ఇది చట్టవిరుద్దమైన చర్య అని.. దీన్నిఅందరూ ప్రతిఘటించాలని కోరారు. ఇదిలా ఉంటే చెట్ల నరికివేతపై బిగ్ బీ అమితాబ్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌లు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఇదే అంశంపై వారం క్రితం అమితాబ్ ఇంటివద్ద కొంతమంది స్కూల్ చిన్నారులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.
Lathi Charge done for the first time at the peaceful protests for Aarey. People have been detained inside, gates have been closed and the authorities are abusing the protestors. Women have been pushed and detained by the police at this hour, which is lawfully wrong. #SaveAarey
— Jignesh Mevani (@jigneshmevani80) October 4, 2019
A project that should be executed with pride, the Metro 3, @MumbaiMetro3 has to do it in the cover of the night, with shame, slyness and heavy cop cover.
The project supposed to get Mumbai clean air, is hacking down a forest with a leopard, rusty spotted cat and more— Aaditya Thackeray (@AUThackeray) October 4, 2019