రాజధాని రహస్యాన్ని వెల్లడించిన మంత్రి బొత్స
ఏపీ రాజధాని తరలింపు విషయంలో సుమారు నెలన్నరగా ఓవైపు ఆందోళనలు, ఇంకోవైపు రాజకీయ దుమారం చెలరేగుతూనే వుంది. రాజధాని తరలించే అవకాశముందంటూ మూడు, నాలుగు నెలల క్రితమే చూచాయగా ప్రకటించి సంచలనం రేపిన మంత్రి బొత్స సత్యనారాయణ తాజా పరిణామాల నేపథ్యంలో ఓ సీక్రెట్‌ను వెల్లడించారు. పనిలో పనిగా జగన్ ప్రభుత్వంపై తరచూ చురకలంటిస్తున్న టీడీపీ నేతలు నారాలోకేశ్, కేశినేని నానిలపై సెటైర్లు వేశారు మంత్రి బొత్స. ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేసే దిశగా జగన్ […]
ఏపీ రాజధాని తరలింపు విషయంలో సుమారు నెలన్నరగా ఓవైపు ఆందోళనలు, ఇంకోవైపు రాజకీయ దుమారం చెలరేగుతూనే వుంది. రాజధాని తరలించే అవకాశముందంటూ మూడు, నాలుగు నెలల క్రితమే చూచాయగా ప్రకటించి సంచలనం రేపిన మంత్రి బొత్స సత్యనారాయణ తాజా పరిణామాల నేపథ్యంలో ఓ సీక్రెట్‌ను వెల్లడించారు. పనిలో పనిగా జగన్ ప్రభుత్వంపై తరచూ చురకలంటిస్తున్న టీడీపీ నేతలు నారాలోకేశ్, కేశినేని నానిలపై సెటైర్లు వేశారు మంత్రి బొత్స.
ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేసే దిశగా జగన్ ప్రభుత్వం మాట తప్పం.. మడమ తిప్పం అన్నట్లుగా ముందుకు వెళుతూనే వుంది. ఈ విషయంలో రాజీ లేదని జగన్ ప్రభుత్వ చర్యలు చాటుతూనే వున్నా .. విపక్షం మాత్రం ఇంకా రాజధాని తరలింపును అడ్డుకుంటామన్న ధోరణిలో విపక్ష టీడీపీ ఆందోళనాపర్వాన్ని కొనసాగిస్తూనే వుంది. ప్రభుత్వం వెనక్కి తగ్గే ఛాన్సెస్ లేవని గ్రహించడం వల్లనేనేమో టీడీపీ మినహా ఇతర పార్టీలు రాజధాని ఆందోళనకు పెద్దగా ప్రాధాన్యమివ్వని పరిస్థితి కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో గురువారం బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని తరలింపు పనులు ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసిన రోజే నుంచే విశాఖకు సచివాలయాన్ని తరలించే పనులు మొదలయ్యాయని బొత్స తెలిపారు. జీఎన్ రావు కమిటీపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు.
సముద్రా తీరానికి 2, 3 కిలోమీటర్ల దూరంలో రాజధాని పెట్టుకోమని జీఎన్ రావు కమిటీ సూచించిందని, కొన్ని పత్రికలు చెబుతున్నట్లు 50 కిలోమీటర్ల దూరంలో పెట్టమని సిఫారసు చేయలేదని బొత్స వివరించారు. రాజధానికి సంబంధించిన అన్ని రిపోర్టులను కోర్టులో సబ్మిట్ చేశామని, తమ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని అంటున్నారు బొత్స. రాజధాని ఇంచు కూడా కదలదు అనడానికి లోకేశ్, కేశినేని నాని ఎవరని బొత్స ప్రశ్నించారు.