BJP leaders started war of words on MIM party: సీఏఏ వ్యతిరేకత పేరిట పాకిస్తాన్ అనుకూల నినాదాలకు కారణమవుతున్నారంటూ ఎంఐఎం పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు బీజేపీ నేతలు. ఎంఐఎం పార్టీ ఒక మత చాంధస పార్టీ అని మరోసారి నిరూపితమయ్యిందన్నారు బీజేపీ నేత కృష్ణసాగర రావు. అది మత విద్వేషాలను, హింసను రెచ్చగొట్టి హిందూ-ముస్లింల మధ్య అగాధాన్ని సృష్టించే పార్టీ అని విమర్శించారు. పైకి లౌకిక వాదం చెబుతూ, దళితులవైపు చేతులు చాస్తున్నట్టు నటిస్తూ, తెర వెనుక జాతి వ్యతిరేక కార్యకలాపాలను ఎంఐఎం ఎలా నడిపిస్తుందో గమనించాలన్నారు కృష్ణసాగర రావు. “CAA, NRC, NPRలను ఆధారం చేసుకుని దేశంలో మత ఘర్షణ వాతావరణాన్ని తేవడానికి ఎంఐఎం చూస్తోంది. దానికి కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు తొత్తులుగా వ్యవహరిస్తున్నాయి. ఎంఐఎం గజదొంగ అయితే టిఆర్ఎస్ ఏంటి?’’ అంటూ నిలదీశారు కృష్ణసాగర్ రావు.
తన సారథ్యంలో సభ నిర్వహిస్తూ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయించే స్థితికి అసదుద్దీన్ దిగజారారని బీజేపీ నేతలంటున్నారు. 15 కోట్ల మంది ముస్లింలు వంద కోట్ల మంది హిందువులను చూసుకోగలరంటూ చేసిన వ్యాఖ్యలు జాతిని చీలుస్తాయని అంటున్నారు కమలం నేతలు. వారిస్ పఠాన్ వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్ 0స్పందించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అసదుద్దీన్ సభలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ చేసిన నినాదాలను సమర్థిస్తున్నారా అంటూ టీఆర్ఎస్ నేతలను ప్రశ్నిస్తున్నారు.