ఎన్నో ఊహించని పరిణామాల మధ్య.. ఉత్కంఠకు తెరతీస్తూ బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ 3 అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు నెలలపాటు నిర్విరామంగా కొనసాగనున్న ఈ షోకు హోస్ట్‌గా నాగార్జున వ్యహరిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల మనసుగెలుచుకున్న బిగ్‌బాస్ సీజన్ వన్, సీజన్ టు కంటే భిన్నంగా ఈ షో నడిపేందుకు నాగ్ రెడీ అయ్యాడు. ఆదివారం రాత్రి 9 గంటలకు వేడకగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో బిగ్‌బాస్ హౌస్‌లో వెళ్ళబోయే హౌస్‌మేట్స్‌ను నాగ్ పరిచయం చేశారు.
మొత్తం 15 మంది కంటెస్టెంట్లను కింగ్ నాగార్జున బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపేందుకు తనదైన శైలిలో మాట్లాడారు. “మనసు కోతి లాంటిది.. మరి అలాంటి మనసున్న కొంతమంది మనుషులు ఒకే ఇంట్లో చేరితే.. మరకారంతో వెటకారంతో వాళ్ళను ఏకతాటిపైకి తీసుకువచ్చేది ఎవరు? అధికారంతో నడిపేది ఎవరు? ఆ ఇంట్లో కొత్త ఉత్సాహం నింపే శక్తిగల వ్యక్తి ఎవరు? అతను ఎవరో కాదు ..నేనే” మీ కింగ్ నాగార్జున అంటూ నాగ్ బిగ్‌బాస్ షోను స్టార్ట్ చేశారు.
షో ప్రారంభానికి ముందు కింగ్ మూవీలోని ” నడిచే స్టైలేమో రాకింగ్ ” అంటూ సాగే సాంగ్‌తో నిజంగా రాకింగ్ గానే ఎంట్రీ ఇచ్చారు నాగ్. రావడంతోనే గత రెండు సీజన్‌లను ప్రేక్షకుల దగ్గరికి చేరడానికి హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్, నానీలకు థ్యాంక్స్ చెప్పారు.
ఈ షోలో పార్టిసిపేట్ చేసే 15 మందిని మీరే సెలెక్ట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించడంతో నాగ్.. వారిని వేదికపైకి పిలిచి ఒక్కరిని పరిచయం చేశారు.
* తీన్మార్ వార్తలతో తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్ధానాన్ని కైవసం చేసుకున్న సావిత్రి(శివజ్యోతి) ఫస్ట్ కంటెస్టెంట్‌గా ప్రకటించారు.
* టీవీ నటుడు, తెలుగు సీరియల్ హీరో రవికృష్ణ రెండో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు.
* మూడో కంటెస్టెంట్‌గా డబ్‌స్మాష్ స్టార్ అషూరెడ్డి ఎంట్రీ ఇచ్చింది.
* సెలెక్ట్ కావడంతోనే ఈ ముగ్గురికి ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్
* ఇక నాలుగో కంటెస్టెంట్‌గా టీవీ9 జర్నలిస్ట్ జాఫర్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఆయనపై జర్నలిస్ట్ రేంజ్‌లోనే ప్రశ్నలు కురిపించారు నాగ్.
* ఐదో కంటెస్టెంట్‌గా పక్కా మాస్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చింది హిమజ. నాగ్ ఎదురుగా ఉన్న విషయానికి ఇది నిజమేనా అనేంతగా ఉబ్బితబ్బిబ్బయ్యింది హిమజ. ఒకసారి టచ్ చేయమని నాగ్‌ని అడిగింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపుతూ నాగ్ ఒక హగ్ ఇచ్చారు.
* తన హుషారైన పాటలతో కుర్రకారును రెచ్చగొట్టే రాహుల్ సింప్లిగంజ్ ఆరో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు.
* ఇక ఏడవ కంటెస్టెంట్ రోహిణి.. ఎంట్రీతోనే నాగ్‌ను ఇంప్రెస్ చేసింది. సోగ్గాడే చిన్నినాయనా అంటూ డాన్స్ ఫెర్ఫార్మ్ చేసింది. సోగ్గాడే చిన్ని నాయనా అంటూ పిలిచావుగా.. వచ్చాను. మరి ఏమిస్తావ్ అనగానే .. “మీరు ఏమడిగినా ఇస్తా” అంటూ సిగ్గుపడిపోయింది రోహిణి.
* ఎనిమిదో కంటెస్టెంట్ .. అసలే ఆయన డాన్స్ మాస్టర్ ఇంకేముంది బిగ్‌బాస్ స్టేజ్ ఆయన ఎంట్రీతో షేక్ అయిపోయింది. ఆయనే బాబా భాస్కర్.
* ఇక తొమ్మిదో నెంబర్ కంటెస్టెంట్ ఉయ్యాల జంపాల ఫేమ్ పునర్నవి భూపాలం.
* పదో కంటెస్టెంట్ంగా తెలుగు తెరపై తనదైన శైలిలో హాస్యాన్ని సునాయాసంగా పండించిన నటి హేమ. ఆమెను నాగ్ .. వంట వచ్చా అని అడిగారు. హౌస్‌లో కిచెన్ నేనే సొంతం చేసుకుంటాను సమాధానం చెప్పారు హేమ.
* ఇక పదకొండవ కంటెస్టెంట్‌గా అలీ రజా తన సిక్స్ ప్యాక్‌తో నాగ్ సాంగ్‌తో పిచ్చిలేపాడు. *
* పన్నెండవ కంటెస్టెంట్‌గా కమెడియన్ మహేశ్ విట్టా దుమ్మురేపాడు. తనదైన సీమ యాసలో మాట్లాడుతూ నాగ్ ఇంప్రెషన్ కొట్టేశాడు
* బిగ్‌బాస్ సీజన్ త్రీ ఎనౌన్స్ కాగానే ముందుగా అంతా అనుకున్న పేరు యాంకర్ శ్రీముఖి. స్టేజ్ మీద అదిరిపోయే డాన్స్‌తో కిరాక్ అనిపించింది. పదమూడో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంటరయ్యారు.
* ఇక పద్నాలుగు, పదిహేను కంటెస్టెంట్స్ గా హీరో వరుణ్ సందేశ్, వితికా జంట. వీరిద్దరు భార్యభర్తల్ని హౌస్‌లోకి పంపారు నాగ్. అయితే వితికాను ఎత్తుకుని వెళ్లాలని అనడంతో .. అలాగే వెళ్లాడు వరుణ్ సందేశ్.
* వీరంతా లోపలికి వెళ్లగానే హోస్ట్ నాగార్జున బాంబ్ లాంటి వార్త చెప్పారు. ఫస్ట్ రోజు కంప్లీట్ అయ్యింది. రేపు మరో ట్విస్ట్ ఉండబోతుందని ..ఇప్పుడు లోపలికి వెళ్లిన వారిలో శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితికా షెరూ, బాబా భాస్కర్‌లను నామినేట్ అయ్యారంటూ చెప్పారు నాగ్. దీంతో లోపలికి వెళ్లిన వెంటనే ఇలా చెప్పడంతో వీరంతా షాక్‌లోనే ఉన్నారు.
కంటెస్టెంట్స్ ఎంట్రీతో ఫస్ట్ డే బిగ్‌బాస్ ముగిసి పోయింది.