చేతులెత్తేసిన ఆర్టీసీ జేఏసీ.. ‘అశ్వం’ చతికిలబడింది.?

|

Nov 28, 2019 | 3:39 PM

ఆర్టీసీ జేఏసీ పదవికి అశ్వత్థామరెడ్డి రాజీనామా చేస్తారా.. అంటే.? అవుననే అంటున్నాయి జేఏసీ వర్గాలు.. సమ్మెను నడిపించడంలో పూర్తిగా విఫలమవ్వడమే కాకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 52 రోజులు తమ డిమాండ్ల కోసం సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులకు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి నేతృత్వం వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటుగా మరో 26 డిమాండ్ల పరిష్కారం కోసం అక్టోబర్ 5 నుంచి కార్మికులు సమ్మె బాట పట్టారు. అసలే దసరా […]

చేతులెత్తేసిన ఆర్టీసీ జేఏసీ.. అశ్వం చతికిలబడింది.?
Follow us on

ఆర్టీసీ జేఏసీ పదవికి అశ్వత్థామరెడ్డి రాజీనామా చేస్తారా.. అంటే.? అవుననే అంటున్నాయి జేఏసీ వర్గాలు.. సమ్మెను నడిపించడంలో పూర్తిగా విఫలమవ్వడమే కాకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 52 రోజులు తమ డిమాండ్ల కోసం సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులకు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి నేతృత్వం వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటుగా మరో 26 డిమాండ్ల పరిష్కారం కోసం అక్టోబర్ 5 నుంచి కార్మికులు సమ్మె బాట పట్టారు. అసలే దసరా సీజన్‌.. ఆపై ప్రభుత్వానికి కాస్త కూడా గడువు ఇవ్వకుండా దిగిపోవడంతో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

తమ జీవితాలను కూడా పణంగా పెట్టి మరీ సమ్మెలో పాల్గొన్న కార్మికులను.. యూనియన్ల మాట వినకుండా వచ్చి విధుల్లో చేరాలని కేసీఆర్ పలుమార్లు చెప్పారు. అయితే కార్మికులు ఆయన మాటను పట్టించుకోలేదు. దీంతో కార్మికులు చేపట్టిన సమ్మె చట్టవిరుద్దమని.. వారిని చర్చలకు పిలిచే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

ఆ తర్వాత సమ్మె కేసుపై హైకోర్టులో వాదోపవాదాలను జరిగాయి. వాటిని కోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. పలు మార్లు ప్రభుత్వాన్ని.. అంతేకాక కార్మికులను కూడా మందలించింది. అయితే చాలారోజులు విచారణ తర్వాత కోర్టు ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇక కోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం.. ఆర్టీసీ జేఏసీ పెద్దలను చర్చలకు పిలిచినా.. అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఈలోపు కొందరు కార్మికులు కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయినా కూడా జంకలేదు.. తమ డిమాండ్లను పరిష్కారంలో కార్మికులందరూ అశ్వత్థామరెడ్డిపై పూర్తి నమ్మకం ఉంచారు. అటు కేసీఆర్.. ఆర్టీసీ సమ్మెకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో తెరపైకి రూట్ల ప్రైవేటీకరణ అంశాన్ని తీసుకొచ్చారు. దీనికి హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అటు కోర్టులోనూ.. ఇటు ప్రభుత్వం నుంచి వ్యతిరేకతలు రావడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెను విరమిస్తున్నట్లు అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా కార్మికులను భేషరతుతో విధుల్లోకి చేర్చుకోవాలని.. రూట్లను ప్రైవేటీకరణ చేయరాదని కోరారు. అయినా కూడా ప్రభుత్వం కరగలేదు.. ఇష్టానుసారంగా సమ్మెకు దిగి.. ఇష్టమొచ్చినప్పుడు మళ్లీ విధుల్లో చేరడం దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా లేదన్నారు. ఆర్టీసీ కార్మికులు తమంతట తామే విధులకు గైర్హాజరై, చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు తప్ప, ఆర్టీసీ యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ సమ్మె చేయమని చెప్పలేదన్నారు.

ఇక ఈ తరుణంలో అశ్వత్థామరెడ్డిపై ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. సమ్మె కాలంలో అశ్వత్థామ ఏకపక్ష ధోరణితో వ్యవహరించడమే కాకుండా.. సొంత ప్రయోజనాల కోసం రాజకీయ వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాక సమ్మె విరమణ సమయంలో కూడా ఏకపక్షంగానే నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన ఆయన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తారని సమాచారం అందుతోంది.  మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.