అక్కా చెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం.. మనోవేదనే కారణమా..?
చిన్న చెల్లి చేసిన పనికి తమకు పెళ్లి కావడం లేదని మహబూబ్‌నగర్‌కు చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువతులు కుటుంబానికి భారం కాకూడని భావించి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. చివరి చెల్లెలు, తల్లి గట్టిగా కేకలు పెట్టడంతో స్థానికులు వచ్చి తలుపులు పగులగొట్టి వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నలుగురిలో ఒక అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జడ్చర్ల సమీపంలోని ఓ కుటుంబంలో ఆరుగురు […]
చిన్న చెల్లి చేసిన పనికి తమకు పెళ్లి కావడం లేదని మహబూబ్‌నగర్‌కు చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువతులు కుటుంబానికి భారం కాకూడని భావించి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. చివరి చెల్లెలు, తల్లి గట్టిగా కేకలు పెట్టడంతో స్థానికులు వచ్చి తలుపులు పగులగొట్టి వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నలుగురిలో ఒక అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
జడ్చర్ల సమీపంలోని ఓ కుటుంబంలో ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు. వీరిలో ఇంకా ఎవరికీ వివాహం కాలేదు. ఐదో అమ్మాయి రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా కనిపించలేదు. చివరికి ఓ అబ్బాయితో ఇంటి నుంచి వెళిపోయిందని తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కుటుంబ పరువు తీసిందని ఆవేదన చెందారు. చిన్న అమ్మాయిని, తల్లిని గదిలో పెట్టి.. నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.