ఆరోగ్యసేతు యాప్‌తో ప్రమాదం.. ఓవైసీ హెచ్చరిక

|

May 02, 2020 | 5:51 PM

దేశవ్యాప్తంగా విపరీతంగా జనాదరణ పొందుతున్న ఆరోగ్య సేతు మొబైల్ యాప్‌పై రాజకీయ దుమారం రాజుకుంటోంది. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోగ్య సేతు యాప్ ఒక చీకటి యాప్ అని అభివర్ణించారు

ఆరోగ్యసేతు యాప్‌తో ప్రమాదం.. ఓవైసీ హెచ్చరిక
Follow us on

దేశవ్యాప్తంగా విపరీతంగా జనాదరణ పొందుతున్న ఆరోగ్య సేతు మొబైల్ యాప్‌పై రాజకీయ దుమారం రాజుకుంటోంది. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోగ్య సేతు యాప్ ఒక చీకటి యాప్ అని అభివర్ణించారు. ఈ యాప్ ద్వారా.. దాన్ని వినియోగించే వారి డేటా లీకయ్యే ప్రమాదం కనిపిస్తోందని ఓవైసీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్న కరోనా వైరస్‌ను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చప్పట్లతోను, దీపాలతోను.. చివరికి ఏ మాత్రం నమ్మదగినదిగా లేని ఆరోగ్యసేతు మొబైల్ యాప్‌తోను ఎదుర్కోవాలని చూడడం దురదృష్టకరమని అసదుద్దీన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

అయితే అసదుద్దీన్ నేరుగా ప్రధానమంత్రి మోదీని, కేంద్ర ప్రభుత్వం పేరును ప్రస్తావించకుండా.. కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ సుల్తానులుగా అభివర్ణించడం విశేషం. ఆరోగ్యశ్రీ సేతు యాప్‌ను వినియోగిస్తే అందులో వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేయాల్సి ఉంటుందని, అది వారి వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగిస్తుందని ఓవైసీ వాదిస్తున్నారు.