బార్ల బెడదకు చెక్.. ఏపీ సర్కార్ సూపర్బ్ నిర్ణయం

ఏపీలో బార్ల సంఖ్యను 40 శాతం మేరకు కుదించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ నిర్ణయాన్ని తక్షణం అమల్లోకి తేవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్ ఆదాయం తగ్గుతుందని అధికారులు చెబుతున్నా.. తానిచ్చిన మద్యం నియంత్రణ హామీకి కట్టుబడి వుంటానని సీఎం జగన్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. మంగళవారం ఏపీలో ఎక్సైజ్ పాలసీపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న బార్ల సంఖ్యను 40 శాతం తగ్గించాలని సమావేశంలో నిర్ణయించారు […]

బార్ల బెడదకు చెక్.. ఏపీ సర్కార్ సూపర్బ్ నిర్ణయం
Follow us
Rajesh Sharma

|

Updated on: Nov 22, 2019 | 6:25 PM

ఏపీలో బార్ల సంఖ్యను 40 శాతం మేరకు కుదించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ నిర్ణయాన్ని తక్షణం అమల్లోకి తేవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్ ఆదాయం తగ్గుతుందని అధికారులు చెబుతున్నా.. తానిచ్చిన మద్యం నియంత్రణ హామీకి కట్టుబడి వుంటానని సీఎం జగన్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. మంగళవారం ఏపీలో ఎక్సైజ్ పాలసీపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో ఉన్న బార్ల సంఖ్యను 40 శాతం తగ్గించాలని సమావేశంలో నిర్ణయించారు ముఖ్యమంత్రి. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 798 బార్లు వున్నాయి. వాటికి స్టార్ హోటళ్ళలోని బార్లు అదనం. 798 బార్లలో 50 శాతం కుదించాలని ముందుగా సీఎం ఆదేశించారు. అయితే ఇప్పటికే మద్యం దుకాణాలను 20 శాతం తగ్గించామని, బార్ల సంఖ్యను కూడా 50 శాతం తగ్గిస్తే ఎక్సైజ్ ఆదాయం పూర్తిగా పడిపోతుందని అధికారులు వాదించినట్లు తెలుస్తోంది. దాంతో బార్ల సంఖ్యను 40 శాతం తగ్గించాలని సీఎం నిర్ణయించారు. అయితే విడతల వారీగా బార్ల సంఖ్యను ఇంకా తగ్గించాలని జగన్ చెప్పినట్లు అధికారులు అంటున్నారు.

అదే సమయంలో బార్లలో మద్యం అమ్మకాల సమయాలను కూడా ఏపీ ప్రభుత్వం సవరించింది. బార్లలో మద్యం సరఫరాను ఉదయం 11 గంటలకు ప్రారంభించి, రాత్రి 10 గంటల వరకు పరిమితం చేయాలని, ఆహారాన్ని మాత్రం రాత్రి 11 గంటల వరకు సరఫరా చేయొచ్చని నిర్ణయించారు. స్టార్ హోటళ్ళలో మాత్రం ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం సరఫరా చేసుకునేలా వెసులుబాటు కల్పించారు.

బార్లలో మద్యం ధరలు పెంపు ?

వైన్ షాపులు, బార్ల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం బార్లలో అమ్మే మద్యం ధరలను పెంచే ఆలోచన చేస్తోంది. ఈ పెరుగుదల 10 నుంచి 20 శాతం వుండవచ్చని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో మద్యం కల్తీకి పాల్పడినా, స్మగ్లింగ్‌ చేసినా, నాటుసారా తయారు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

నాన్‌బెయిల్‌ బుల్‌ కేసులు నమోదు చేయాలని నిర్దేశించారు. జరిమానాలను భారీగా పెంచాలని తలపెట్టారు. లైసెన్స్‌ ఫీజుకు 3 రెట్లు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించాలని నిర్ణయించారు. మద్యం, ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టాలు తీసుకురావాలన్న యోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.