పరిపాలన వికేంద్రీకరణపై మళ్లీ “నాట్ బిఫోర్ మి”

|

Aug 19, 2020 | 12:51 PM

ఏపీ రాజధాని మార్పుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. "మళ్లీ నాట్ బిఫోర్ మి" సుప్రీం కోర్టులో సేమ్ సీన్.. గతంలో జరిగినట్లే ఈ సారి జరిగింది.  పరిపాలన వికేంద్రీకరణ, CRDA రద్దు...

పరిపాలన వికేంద్రీకరణపై మళ్లీ నాట్ బిఫోర్ మి
Follow us on

ఏపీ రాజధాని మార్పుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. “మళ్లీ నాట్ బిఫోర్ మి” సుప్రీం కోర్టులో సేమ్ సీన్.. గతంలో జరిగినట్లే ఈ సారి జరిగింది.  పరిపాలన వికేంద్రీకరణ, CRDA రద్దుల చట్టాలపై విచారణ సుప్రీంకోర్టులో కీలక మలుపులు తిరుగుతోంది. మొన్న చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే ‘నాట్‌ బిఫోర్‌ మీ’ అంటూ… ఆ కేసు విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేశారు.

ఇవాళ విచారణ జరగాల్సిన మరో ధర్మాసనంలోనూ న్యాయమూర్తి నారీమన్‌ అదే కారణంతో మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. మొన్న చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే కూతూరిని రాజధాని రైతులు తమ తరపున న్యాయవాదిగా పెట్టుకున్నారు. అందువల్ల ఆ కేసు విచారణ నుంచి చీఫ్‌ జస్టిస్‌ తప్పుకున్నారు.

ఇప్పుడు న్యాయమూర్తి నారీమన్‌ తండ్రిని కూడా రాజధాని రైతులు తమ తరపున న్యాయవాదిగా పెట్టుకోవడం వల్ల ఆయన కూడా విచారణ నుంచి తప్పుకున్నారు. అందువల్ల ఈ కేసు విచారణ వాయిదా పడింది.

పాలనావికేంద్రీకరణ, రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.