పబ్జీ గేమ్‌కి బానిసగా మారిన మరో విద్యార్థి మృతి

|

Aug 11, 2020 | 12:28 PM

ఆన్ లైన్ మల్టీ ప్లేయర్ మొబైల్ గేమ్ పబ్జీ (PUBG)కి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ గేమ్ ఆడుతున్న యువత ప్రాణాల మీదకి తెచ్చుకొంటున్నారు. గేమ్ మాయలో పడి ప్రాణాలను సైతం

పబ్జీ గేమ్‌కి బానిసగా మారిన మరో విద్యార్థి మృతి
Follow us on

Another Student Killed in Pubg Game : ఆన్ లైన్ మల్టీ ప్లేయర్ మొబైల్ గేమ్ పబ్జీ (PUBG)కి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ గేమ్ ఆడుతున్న యువత ప్రాణాల మీదకి తెచ్చుకొంటున్నారు. గేమ్ మాయలో పడి ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు. తెలుగురాష్ట్రాలలో కూడా చాలామంది యువత పబ్జీ గేమ్ మాయలో పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.  ఇలా పబ్జీ గేమ్ మరొకరి ప్రాణం తీసింది.

పబ్జీ ఆటకు బానిసైన ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగింది. ద్వారకతిరుమలకు చెందిన 16ఏళ్ల పవన్‌ అనే యువకుడు కొద్ది కాలంగా పబ్జీ, ఫ్రీ ఫైర్‌ గేమ్‌లకు బానిసయ్యాడు. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న పవన్‌ లాక్‌డౌన్‌ వల్ల ఇంటర్మీడియెట్‌ చదువుతున్న ఈ యువకుడు ఇంటి వద్దే ఖాళీగా ఉంటూ, ఎక్కువ సమయం ఫోన్‌తోనే గడుపుతున్నాడు. నిద్రాహారాలు మానేసి రాత్రి, పగలు అనే తేడాలేకుండా పబ్జీ గేమ్‌ను ఆడేవాడు. నాలుగు రోజుల నుంచి అతడి ఆరోగ్యం దెబ్బతింది. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యం చేయించారు.