యాంకర్‌గా ప్రదీప్‌కి.. బుల్లితెరపై స్పెషల్ ప్లేస్ ఉంది. ప్రదీప్ అంటే.. మామూలు ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదు. ఇప్పుడు అతనికి సంబంధించిన ఓ వార్త అందరినీ బాధ పెడుతోంది. అతని మాటలకు.. ఆటలకు.. ఫ్యాన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు అభిమానులు. ప్రత్యేకంగా.. ప్రదీప్ అంటే.. ఫిమేల్ ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు.. జోక్స్ వేసి.. ఇతర యాంకర్‌లను ఇట్టే ఇరుకున పెట్టేస్తాడు. అలాంటి ప్రదీప్ గత కొన్ని రోజుల నుంచి ఏ టీవీ షోలోనూ కనిపించడం లేదు. మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తోన్న ‘ఢీ’ షోలో కూడా కనిపించడం లేదు. అతని ప్లేస్‌లో.. రవి ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఉన్నట్లుండి అతను కనిపించకపోవడానికి కారణం ఏంటనేది జనాలకు అర్థం కాలేదు.
ప్రదీప్ ఎక్కువ రెమ్యునరేషన్ అడిగాడని.. అందుకే అతన్ని దూరం పెట్టారనే టాక్స్ వినిపించాయి. కానీ.. అసలు కారణం అది కాదని.. ప్రదీప్‌కి అనారోగ్యం కారణంగానే.. షోలకు దూరంగా ఉన్నాడని.. తాజాగా.. యాంకర్ రవి లీక్ చేసిన వీడియోలో తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని బయటకు రానీయకుండా.. కూడా చూసుకున్నాడు ప్రదీప్. కానీ.. రవి కారణంగా అది బయటకొచ్చింది.
ఈ నెల 23న యాంకర్ ప్రదీప్ బర్త్‌డే సందర్భంగా.. విష్ చేస్తూ.. రవి ఫేస్‌బుక్‌లో లైవ్ ఇచ్చాడు. ప్రదీప్‌కి ఫోన్ చేసి విష్ చేశానని.. అంతేకాదు.. అతడు రికవర్ అవుతున్నాడని.. త్వరలోనే మళ్లీ బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తాడని.. అంటున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే.. ప్రదీప్ మొత్తానికి అనారోగ్యంతో బాధ పడుతున్నాడని అర్థమవుతోంది. అయితే.. అదేంటనేది మాత్రం తెలియడం లేదు. అనారోగ్యం నుంచి కోలుకున్నాక మళ్లీ ప్రదీప్.. బుల్లితెరపై రచ్చ చేస్తాడని.. రవి చెప్పుకొచ్చాడు. ఏమైనా.. ఇది ప్రదీప్ ఫ్యాన్స్‌కి చేధు వార్తనే చెప్పాలి.