పాకిస్తాన్‌కు అమెరికా భారీ షాకిచ్చింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కు చెందిన అన్ని అంతర్జాతీయ విమానాలపై అమెరికా నిషేధం విధించింది. పాక్ పైలట్లలో చాలా వరకు ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్లతో ఫ్లైట్స్ నడుపుతున్నట్లు తేలడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ రవాణా శాఖ వెల్లడించింది. పాక్ పైలట్లలో ఎక్కువ మంది నకిలీ డిగ్రీలతో ఉద్యోగాలు పొందివనవారేనని నిర్థారణ కావడంతో ప్రయాణికుల క్షేమం దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామన్నారు.
పాకిస్తాన్‌లోని కరాచీలో విమానాశ్రయంలో మే 22న పీఐఏ జెట్ విమానం కూలడంతో 97 మంది మరణించారు. ఆ విమానం నడిపిని పైలట్ల అర్హతలపై అభ్యంతరాలు వక్తమయ్యాయి. దీంతో ఎంక్వైరీ చేయగా, వారిద్దరివి నకిలీ సర్టిఫికెట్లేనని తేలింది. దీంతో పాకిస్తాన్ పైలట్ల విద్యార్హతలపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే అనుమానం వ్యక్తం చేసింది. పాక్ పైలట్లలో మూడో వంతు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించినట్లు గత నెలలో తేలింది. పీఐఏపై యూఎస్ నిషేధాన్ని పాక్ జయో న్యూస్ ధృవీకరించింది. యూరోపియన్ యూనియన్ పీఐఏపై ఇప్పటికే నిషేధం విధించింది. ఆరు నెలలపాటు యూరఫ్ దేశాలకు అంతర్జాతీయ విమానాలు నడపడానికి వీళ్లేదని పేర్కొంది.