హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లోని 151వ పోలింగ్ బూత్‌లో అక్కినేని అమల తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
Voted !! Thank you Hyderabad , nice arrangements , no crowd at 7.30 am , no stress . I love India ❤️ pic.twitter.com/DAkHzzCunF
— Amala Akkineni (@amalaakkineni1) April 11, 2019