బుల్లెట్ రైళ్లు కాదు కావాల్సింది.. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు

| Edited By: Ram Naramaneni

Oct 18, 2020 | 10:57 PM

ల‌క్నో: ప్రధాని మోదీపై స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్ ఫైర్ అయ్యారు. దేశానికి బుల్లెట్ రైళ్లు అవ‌స‌రం లేద‌ని, సైనికుల‌కు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాల‌న్నారు. ల‌క్నోలో మీడియాతో మాట్లాడుతూ.. మ‌న ఇంటెలిజెన్స్ ఎందుకు విఫ‌ల‌మ‌వుతుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పుల్వామా దాడిని గుర్తు చేస్తూ .. జ‌వాన్ల కుటుంబాల‌కు దేశం అండ‌గా ఉంద‌న్నారు. అన్ని పార్టీలు త‌మ రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌ను ప‌క్క‌న‌పెట్టి, సుర‌క్షితమైన స‌రిహ‌ద్దు కోసం దీర్ఘ‌కాలిక వ్యూహాన్ని ర‌చించాల‌న్నారు. మరోవైపు దేశంలోనే తొలి సెమీ […]

బుల్లెట్ రైళ్లు కాదు కావాల్సింది.. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు
Follow us on

ల‌క్నో: ప్రధాని మోదీపై స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్ ఫైర్ అయ్యారు. దేశానికి బుల్లెట్ రైళ్లు అవ‌స‌రం లేద‌ని, సైనికుల‌కు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాల‌న్నారు. ల‌క్నోలో మీడియాతో మాట్లాడుతూ.. మ‌న ఇంటెలిజెన్స్ ఎందుకు విఫ‌ల‌మ‌వుతుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పుల్వామా దాడిని గుర్తు చేస్తూ .. జ‌వాన్ల కుటుంబాల‌కు దేశం అండ‌గా ఉంద‌న్నారు. అన్ని పార్టీలు త‌మ రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌ను ప‌క్క‌న‌పెట్టి, సుర‌క్షితమైన స‌రిహ‌ద్దు కోసం దీర్ఘ‌కాలిక వ్యూహాన్ని ర‌చించాల‌న్నారు. మరోవైపు దేశంలోనే తొలి సెమీ హై స్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన తొలిరోజే సాంకేతిక సమస్యలతో నిలిచిపోవడంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ప్రారంభించిన అనంతరం వందే భారత్ రైలులో పొగలు వచ్చి.. కోచ్‌లలో విద్యుత్ సమస్య తలెత్తింది. ఫలితంగా రైలు నిలిచిపోయింది. అభివృద్ధి అంటూ వందేభారత్ గురించి చెబుతున్నారు. దేశంలో రైతులంతా ఆగ్రహంతో ఉన్నారని, యువతకు ఉద్యోగాల్లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.భద్రతా వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయిందని.. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది అని ఆయన ధ్వజమెత్తారు.