భారత విమానాశ్రయాల్లో హై అలర్ట్

| Edited By: Srinu

Mar 07, 2019 | 5:05 PM

న్యూఢిల్లీ: భారత్‌లోని అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. విమానాన్ని హైజాక్ చేసి పాకిస్థాన్‌కు తీసుకెళతామంటూ ముంబైలోని ఎయిరిండియా ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్‌కు ఫోన్ వచ్చింది. దీంతో కేంద్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. విమానాశ్రయం లోపల, బయట భద్రత పెంచారు. ప్రతి చోటా క్షణ్నంగా తనిఖీలు నిర్వహించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశించింది. ప్రతి విమానాశ్రయంలోనూ క్విక్ రియాక్షన్ టీమ్స్‌లను మోహరిస్తున్నారు. బెదిరింపు కాల్ నేపథ్యంలో అదనపు బలగాలను తరలిస్తున్నారు. పుల్వామా దాడి […]

భారత విమానాశ్రయాల్లో హై అలర్ట్
Follow us on

న్యూఢిల్లీ: భారత్‌లోని అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. విమానాన్ని హైజాక్ చేసి పాకిస్థాన్‌కు తీసుకెళతామంటూ ముంబైలోని ఎయిరిండియా ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్‌కు ఫోన్ వచ్చింది. దీంతో కేంద్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. విమానాశ్రయం లోపల, బయట భద్రత పెంచారు. ప్రతి చోటా క్షణ్నంగా తనిఖీలు నిర్వహించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశించింది.

ప్రతి విమానాశ్రయంలోనూ క్విక్ రియాక్షన్ టీమ్స్‌లను మోహరిస్తున్నారు. బెదిరింపు కాల్ నేపథ్యంలో అదనపు బలగాలను తరలిస్తున్నారు. పుల్వామా దాడి సూత్రధారులను భారత బద్రతా బలగాలు మట్టుబెట్టిన నేపథ్యంలో ఉగ్రవాదులు ప్రతీకారానికి దిగే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.