క‌న్నీరు పెట్టించే వ్య‌థ‌: 100కి.మీ నడిచి ప్రసవం..పాపాయి మృతి

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన‌ లాక్​డౌన్​లో వలస కూలీల వెత‌లు ఎన్న‌ని చెబుతాం. ప్ర‌స్తుతం ఉన్న ప్రాంతాల్లో బ్ర‌త‌క‌లేక..సొంత ఊరు వెళ్లేందుకు వాహ‌నాలు దొర‌క్క చాలామంది సైకిళ్లపై, న‌డుచుకుంటూ స్వ‌స్థ‌లాల‌కు ప‌య‌న‌మ‌వుతున్నారు. వారి దయనీయ స్థితిని తెలిపే ఘ‌ట‌న‌లు ఇప్ప‌టికే అనేకం చూశాం. తాజాగా మరో ఘటన హ‌ర్యానాలో జరిగింది. పంజాబ్​లోని లుథియానా నుంచి 100 కిలోమీటర్లు కాలి నడకన ప్రయాణించిన ఓ మ‌హిళ‌…హ‌ర్యానాలోని అంబాలాకు చేరుకుంది. మాములు మ‌నుషుల‌కే అంత సుదూర కాలిన‌డ‌క ప్ర‌యాణం […]

క‌న్నీరు పెట్టించే వ్య‌థ‌: 100కి.మీ నడిచి ప్రసవం..పాపాయి మృతి
Follow us

|

Updated on: May 24, 2020 | 12:36 PM

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన‌ లాక్​డౌన్​లో వలస కూలీల వెత‌లు ఎన్న‌ని చెబుతాం. ప్ర‌స్తుతం ఉన్న ప్రాంతాల్లో బ్ర‌త‌క‌లేక..సొంత ఊరు వెళ్లేందుకు వాహ‌నాలు దొర‌క్క చాలామంది సైకిళ్లపై, న‌డుచుకుంటూ స్వ‌స్థ‌లాల‌కు ప‌య‌న‌మ‌వుతున్నారు. వారి దయనీయ స్థితిని తెలిపే ఘ‌ట‌న‌లు ఇప్ప‌టికే అనేకం చూశాం. తాజాగా మరో ఘటన హ‌ర్యానాలో జరిగింది. పంజాబ్​లోని లుథియానా నుంచి 100 కిలోమీటర్లు కాలి నడకన ప్రయాణించిన ఓ మ‌హిళ‌…హ‌ర్యానాలోని అంబాలాకు చేరుకుంది. మాములు మ‌నుషుల‌కే అంత సుదూర కాలిన‌డ‌క ప్ర‌యాణం ఎంతో క‌ష్ట‌మైన‌ది. కానీ ఆమె ఓ గర్భిణి. దీంతో అంబాలాలో ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. ఆడబిడ్డకు జన్మనివ్వగా.. ఆ శిశువు కొద్ది సేపటికే ప్రాణాలు విడిచింది. అంబాలాలోనే ఆ బిడ్డను ఖ‌న‌నం చేశారు తల్లిదండ్రులు.

వివ‌రాల్లోకి వెళ్తే.. బిహార్ కు చెందిన‌ బిందియా, రామ్​ రెండేళ్ల క్రితం వివాహాం చేసుకున్నారు. గతేడాది వారు అక్క‌డినుంచి లుథియానాకు వచ్చారు. అప్పటి నుంచి రామ్​ ఓ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తూ బ్ర‌తుకు బండి సాగిస్తున్నాడు. కరోనా ప‌రిస్థితుల​ వల్ల రామ్​ ఉద్యోగం కోల్పోయాడు. అప్పటి నుంచి బిందియాకు సరైన భోజన కూడాం లేదు. గర్భిణిగా ఎన్నో పోషకాలు తీసుకోవాల్సిన ఆమె..కొన్నిసార్లు మంచినీళ్ల‌తోనే క‌డుపు నింపుకుంది. దీంతో దిక్క‌తోచ‌ని ప‌రిస్థితుల్లో వారు సొంతూరుకు వెళ్దామ‌ని నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌త్యేక రైలు స‌దుపాయం అంద‌క‌పోవ‌డంతో.. అంబాలా వరకు కాలినడకన ప్రయాణం చేయాలని రామ్​, బిందియా డిసైడ‌య్యారు. అంబాలా చేరుకున్న అనంతరం బిందియాకు నొప్పులు మొదలయ్యాయి. పోలీసుల సాయంతో ద‌గ్గ‌ర్లోని ఆసుపత్రికి బిందాయాను తరలించగలిగాడు రామ్​. ఆమె అక్క‌డ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ పసికందు కొద్దిసేపటికే ప్రాణాలు విడిచింది.

మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..