బీ కేర్‌ఫుల్.. దానికి అందరూ ఒక్కటే అంటున్న త్రిష

| Edited By:

Mar 27, 2020 | 4:20 PM

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని.. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పలురాష్ట్రాలు రాత్రి సమయాల్లో కర్ఫ్యూని విధించాయి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 7.00 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులతో పాటు.. పలువురు క్రీడాకారులు.. వారి వారి […]

బీ కేర్‌ఫుల్.. దానికి అందరూ ఒక్కటే అంటున్న త్రిష
Follow us on

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని.. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పలురాష్ట్రాలు రాత్రి సమయాల్లో కర్ఫ్యూని విధించాయి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 7.00 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులతో పాటు.. పలువురు క్రీడాకారులు.. వారి వారి అభిమానులకు.. ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ సూచిస్తున్నారు. తాజాగా.. నటి త్రిష కూడా.. తన అభిమానులకు కరోనా బారినపడకుండా పలు జాగ్రత్తలు తెలిపింది.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అంతా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని.. ఈ మహమ్మారికి ప్రాంతం, భాష, వయస్సు వంటివి ఏం తెలియవంటూ పేర్కొన్నారు. ఈ వైరస్ ఎవరికైనా సోకుతుందని.. ఒక ప్రాంతం.. ఓ రాష్ట్రంపఐ మాత్రమే ఎఫెక్ట్‌ ఉంటుందనుకోవద్దన్నారు. అందుకే ముందస్తు జాగ్రత్తగా అందరూ ఇంట్లోనే ఉండాలని.. ఎప్పటికప్పుడు శుభ్రతను పాటిస్తూ.. చేతులుకడుక్కోవాలని సూచనలు చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో మూడు వారాలపాటు ఇంట్లోనే ఉండటమనేది.. కాస్త కష్టమైనప్పటికీ.. మనల్ని.. మన సమాజాన్ని కాపాడుకునేందుకు తప్పనిసరిగా ఉండాల్సిందేనన్నారు. ప్రజలంతా ఈ లాక్‌డౌన్ సమయంలో ఇళ్లలో ఉండి.. కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలన్నారు.

కాగా.. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఏడు వందలు దాటాయి. అలాగే మృతుల సంఖ్య పదహారుకు చేరింది.