అక్కినేని అఖిల్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా, జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ బన్నీ వాసు, వాసూ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి నిన్న విడుదల చేసిన పోస్టర్‌కి మంచి స్పందనే వస్తోంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. అలాగే ఇదివరకే రిలీజ్ చేసిన ‘మనసా.. మనసా’ సాంగ్‌కి కూడా యూత్ మొత్తం ఫిదా అవుతోంది. రొమాంటిక్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కావాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. కోవిడ్ వ్యాప్తి కాస్త తగ్గితే త్వరలోనే చివరి షెడ్యూల్ ప్రారంభిస్తామని డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తెలిపారు. అలాగే ఈ సినిమాని సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ చేసే సన్నాహాలు చేస్తున్నట్లు కూడా డైరెక్టర్ భాస్కర్ వెల్లడించారు.
Read More:
వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్! శాశ్వతంగా నోటిఫికేషన్లు మ్యూట్ చేసేలా..