భారత వింగ్ కమాండర్ అభినందన్‌కు ‘భగవాన్‌ మహవీర్‌ అహింసా పురస్కార్‌’

| Edited By:

Mar 03, 2019 | 9:30 PM

పాక్ సైన్యానికి యుద్ధ ఖైదీగా దొరికి సురక్షితంగా ప్రాణాలతో తిరిగొచ్చిన భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌కు ‘భగవాన్‌ మహవీర్‌ అహింసా పురస్కార్’ అనే అవార్డును అందిస్తున్నట్లు ‘అఖిల భారతీయ దిగంబర జైన మహాసమితి’ ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలోని సంస్థ ఛైర్‌పర్సన్‌ మహింద్ర జైన్‌ ప్రకటన చేసినట్లు సంస్థ మహారాష్ట్ర కన్వీనర్‌ పరాస్‌ లొహాడే తెలిపారు. ఈ అవార్డును అందుకుంటున్న మొట్టమొదటి వ్యక్తి అభినందన్‌ కావడం విశేషం. ఈ సంవత్సరమే స్థాపించిన ఈ అవార్డు కింద రూ.2.51లక్షల […]

భారత వింగ్ కమాండర్ అభినందన్‌కు ‘భగవాన్‌ మహవీర్‌ అహింసా పురస్కార్‌
Follow us on

పాక్ సైన్యానికి యుద్ధ ఖైదీగా దొరికి సురక్షితంగా ప్రాణాలతో తిరిగొచ్చిన భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌కు ‘భగవాన్‌ మహవీర్‌ అహింసా పురస్కార్’ అనే అవార్డును అందిస్తున్నట్లు ‘అఖిల భారతీయ దిగంబర జైన మహాసమితి’ ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలోని సంస్థ ఛైర్‌పర్సన్‌ మహింద్ర జైన్‌ ప్రకటన చేసినట్లు సంస్థ మహారాష్ట్ర కన్వీనర్‌ పరాస్‌ లొహాడే తెలిపారు. ఈ అవార్డును అందుకుంటున్న మొట్టమొదటి వ్యక్తి అభినందన్‌ కావడం విశేషం. ఈ సంవత్సరమే స్థాపించిన ఈ అవార్డు కింద రూ.2.51లక్షల నగదుతో పాటు జ్ఞాపికను అందజేస్తారు. ఏప్రిల్‌ 17న వర్ధమాన మహావీర జయంతి సందర్భంగా ఈ అవార్డును అభినందన్‌కు అందజేయనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. శత్రుదేశం చెరలో ఉన్నా అభినందన్ ధైర్యాన్ని, మనో స్థైర్యాన్ని యావత్‌ భారత ప్రజలు ప్రశంసించారు.