సైబర్ నేరగాళ్ల చేతిలో.. 2.9 కోట్ల మంది భారతీయలు వ్యక్తిగత డేటా!

సైబర్ నేరగాళ్లు మరోసారి మనదేశంపై విరుచుకుపడ్డారు. భారతదేశానికి చెందిన 2.9 కోట్ల మంది డేటాను డార్క్ వెబ్ సైట్ పెట్టేశారు దుండగులు. ప్రముఖ జాబ్ వెబ్ సైట్లలో ఉన్న డేటాను దొంగిలించినట్లు ఆన్ లైన్ ఇంటెలిజెన్స్ సంస్థ సైబిల్ వెల్లడించింది. భారత దేశ చరిత్రలో మరో అతిపెద్ద సైబర్ క్రైమ్ గా చెబుతున్నారు ఇంటెలిజన్స్ సంస్థ సైబిల్ అధికారులు. దాదాపు 2.9 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని డార్క్ వెబ్ సైట్లో దుండగులు ఉంచారు. వీరంతా కూడా […]

సైబర్ నేరగాళ్ల చేతిలో.. 2.9 కోట్ల మంది భారతీయలు వ్యక్తిగత డేటా!
Follow us

|

Updated on: May 23, 2020 | 5:19 PM

సైబర్ నేరగాళ్లు మరోసారి మనదేశంపై విరుచుకుపడ్డారు. భారతదేశానికి చెందిన 2.9 కోట్ల మంది డేటాను డార్క్ వెబ్ సైట్ పెట్టేశారు దుండగులు. ప్రముఖ జాబ్ వెబ్ సైట్లలో ఉన్న డేటాను దొంగిలించినట్లు ఆన్ లైన్ ఇంటెలిజెన్స్ సంస్థ సైబిల్ వెల్లడించింది.

భారత దేశ చరిత్రలో మరో అతిపెద్ద సైబర్ క్రైమ్ గా చెబుతున్నారు ఇంటెలిజన్స్ సంస్థ సైబిల్ అధికారులు. దాదాపు 2.9 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని డార్క్ వెబ్ సైట్లో దుండగులు ఉంచారు. వీరంతా కూడా ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారిదేనని గుర్తించారు. వ్యక్తిగత వివరాలతో కూడిన రెజ్యూమ్స్ ను ఆన్ లైన్ లో పొందుపర్చినవారి డేటాను దొంగిలించినట్లు నిర్ధారించారు. ఇలాంటి లీకులు సాధారణమైన విషయమే అంటున్నారు సైబిల్ సంస్థ. అయితే, ఈసారి విద్య, చిరునామా వంటి వ్యక్తిగత సమాచారం కూడా చోరీ అయిందని సైబల్ తెలిపింది. ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, వర్క్ ఎక్స్ పీరియన్స్ తదితర వివరాలను కూడా బయటపెట్టిందని చెప్పింది. ఇటీవల ఫేస్ బుక్ హ్యాక్ కు గురైన విషయాన్ని కూడా ఈ సంస్థే వెల్లడించింది.