భర్తల్ని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయిన భార్యలు

| Edited By:

Jul 23, 2019 | 4:09 PM

ఇదొక విషాదకర సంఘటన. నీటిలో కొట్టుకుపోతున్న భర్తలను కాపాడుకునే ప్రయత్నంలో తమ ప్రాణాలు సైతం కోల్పోయారు ఇద్దరు మహిళలు. ఈ ఘటన ఛత్తీస్‌ఘడ్‌లోని కొరియా జిల్లాలో జరిగింది. సోమవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌కు చెందిన తాహీర్(25) అనే వ్యక్తి కొరియాలోని అత్తింటికి భార్య పర్వీన్‌(21)తో సహా వచ్చాడు. వీరిద్దని అతని బావమరిది నియాజ్ షికారు కోసం జలపాతాల వద్దకు తీసుకువెళ్లాడు. వీరి వెంట నియాజ్ భార్య సన కూడా రావడంతో రెండు జంటలు కలిసి బాగనచ్చా జలపాతం వద్ద […]

భర్తల్ని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయిన భార్యలు
Follow us on

ఇదొక విషాదకర సంఘటన. నీటిలో కొట్టుకుపోతున్న భర్తలను కాపాడుకునే ప్రయత్నంలో తమ ప్రాణాలు సైతం కోల్పోయారు ఇద్దరు మహిళలు. ఈ ఘటన ఛత్తీస్‌ఘడ్‌లోని కొరియా జిల్లాలో జరిగింది.

సోమవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌కు చెందిన తాహీర్(25) అనే వ్యక్తి కొరియాలోని అత్తింటికి భార్య పర్వీన్‌(21)తో సహా వచ్చాడు. వీరిద్దని అతని బావమరిది నియాజ్ షికారు కోసం జలపాతాల వద్దకు తీసుకువెళ్లాడు. వీరి వెంట నియాజ్ భార్య సన కూడా రావడంతో రెండు జంటలు కలిసి బాగనచ్చా జలపాతం వద్ద సరదాగా గడిపారు.
అయితే జలపాతం ప్రవాహంలో ప్రమాదవశాత్తు తాహీర్, నియాజ్ ఇద్దరూ కొట్టుకుపోయారు. వెంటనే వీరిని రక్షించే క్రమంలో వారి భార్యలు సైతం నీళ్లలో దూకడంతో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనపై స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వీరి కోసం తీవ్రంగా గాలించి.. చివరికి నలుగురి మృతదేహాలను వెలికి తీశారు.

అయితే ఈ ఏడాది మార్చి నెలలో రెండు జంటలకు వివాహం జరిగట్టుగా తెలుస్తోంది. పెళ్లయిన నాలుగు నెలలకే ఇలా జరగడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.