15 అడుగుల అతి పెద్ద బొంగు చికెన్

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:38 PM

బొంగు చికెన్ కు వైజాగ్ అరకు, పాడేరు ప్రాంతాలు పెట్టింది పేరు. ఆంధ్రప్రదేశ్ ఊటీగా కూడా అరకుకు మంచి ప్రాచూర్యం ఉంది. అరకు అందాలకు ముగ్థుడవని మానవుడుండడు. దానికి మరింత ప్రాచుర్యం కల్పించాలని ఏపీ పర్యాటక సంస్థ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగానే విజయవాడ భవానీపురంలోని హరిత బెర్మ్ పార్క్ వేదికగా దేశంలోనే అతిపెద్ద బొంగు చికెన్ను తయారు చేసి రికార్డు సృష్టించారు. 15 అడుగు పొడవైన బొంగులో చికెన్ వండి ‘ఇండియా బుక్ ఆఫ్ […]

15 అడుగుల అతి పెద్ద బొంగు చికెన్
Follow us on

బొంగు చికెన్ కు వైజాగ్ అరకు, పాడేరు ప్రాంతాలు పెట్టింది పేరు. ఆంధ్రప్రదేశ్ ఊటీగా కూడా అరకుకు మంచి ప్రాచూర్యం ఉంది. అరకు అందాలకు ముగ్థుడవని మానవుడుండడు. దానికి మరింత ప్రాచుర్యం కల్పించాలని ఏపీ పర్యాటక సంస్థ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగానే విజయవాడ భవానీపురంలోని హరిత బెర్మ్ పార్క్ వేదికగా దేశంలోనే అతిపెద్ద బొంగు చికెన్ను తయారు చేసి రికార్డు సృష్టించారు. 15 అడుగు పొడవైన బొంగులో చికెన్ వండి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డు’లో చోటు సంపాదించారు. ఏపీలో ప్రసిద్ధి పొందిన అరకు, పాడేరు ప్రాంతాల్లో విశిష్టమైన బొంగు చికెన్ కు గుర్తింపు తీసుకొచ్చేందుకు.. రాష్ట్రానికి వచ్చే అతిథులకు రుచి చూపించాలన్న ఉద్ధేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు హోటల్ నిర్వాహకులు తెలియజేశారు. నాలుగు గంటలపాటు, ఆరుగురు చెఫ్ లు కష్టపడి ఈ 15 అడుగుల బొంగు చికెన్ను తయారుచేసినట్లు పేర్కొన్నారు.