“వాయు” తుఫాన్ ఎఫెక్ట్.. రైళ్లు, విమాన సర్వీసులు రద్దు

| Edited By: Anil kumar poka

Jun 13, 2019 | 7:22 AM

వాయు తుఫాన్ భయం గుజరాత్ వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పోర్ బందర్ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇవాళ మధ్యాహ్నం తీరాన్ని తాకుతుంది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, రైల్వే, విమానయాన శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా 110 రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. పశ్చిమ రైల్వే పరిధిలోని ప్రధాన ప్రాంతాల్లో నడిచే రైళ్లను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. వెరవల్, ఒఖా, పోర్ బందర్, భావనగర్, […]

వాయు తుఫాన్ ఎఫెక్ట్.. రైళ్లు, విమాన సర్వీసులు రద్దు
Follow us on

వాయు తుఫాన్ భయం గుజరాత్ వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పోర్ బందర్ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇవాళ మధ్యాహ్నం తీరాన్ని తాకుతుంది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, రైల్వే, విమానయాన శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా 110 రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. పశ్చిమ రైల్వే పరిధిలోని ప్రధాన ప్రాంతాల్లో నడిచే రైళ్లను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. వెరవల్, ఒఖా, పోర్ బందర్, భావనగర్, భుజ్, గాంధీథామ్ ప్రాంతాల్లో రైళ్లను రద్దు చేశారు.

సముద్ర తీరంలోని పది జిల్లాల్లో తుపాన్ ప్రభావం ఉండటంతో ఆయా జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు రెండురోజుల పాటు సెలవు ప్రకటించారు. పోర్ బందర్, డియూ, భావనగర్, కేషడ్, కాండ్లా విమానాశ్రయాల్లో తుపాన్ వల్ల విమానాల రాకపోకలను రద్దు చేశామని విమానాశ్రయాల విభాగం అధికారులు ప్రకటించారు.