జగన్ గారూ! ఈ పద్దతి కరెక్ట్ కాదు- పురందేశ్వరి
విశాఖపట్నంలో కేవలం చర్చిలకు మాత్రమే భద్రత కల్పిస్తూ పోలీస్ కమిషనర్ ఆదేశాలివ్వడం సరైన నిర్ణయం కాదన్నారు బీజేపీ సీనియర్ నేత పురందేశ్వరి. ఇలా ఒక మతాన్నో, ఒక కులాన్నో కావాలని ప్రోత్సహించేలా వ్యవహరించడం సమాజంలో ఘర్షణ వాతావరణానికి కారణమవుతుందని వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో జరిగిన బీజేసీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం కూడా తమ తీరు మార్చుకోవాలన్నారు. ఏపీకి కేంద్రం ప్యాకేజీ మాత్రమే ఇవ్వగలదని.. హోదా సాధ్యం కాదన్నారు పురందేశ్వరి. […]

విశాఖపట్నంలో కేవలం చర్చిలకు మాత్రమే భద్రత కల్పిస్తూ పోలీస్ కమిషనర్ ఆదేశాలివ్వడం సరైన నిర్ణయం కాదన్నారు బీజేపీ సీనియర్ నేత పురందేశ్వరి. ఇలా ఒక మతాన్నో, ఒక కులాన్నో కావాలని ప్రోత్సహించేలా వ్యవహరించడం సమాజంలో ఘర్షణ వాతావరణానికి కారణమవుతుందని వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో జరిగిన బీజేసీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ప్రభుత్వం కూడా తమ తీరు మార్చుకోవాలన్నారు. ఏపీకి కేంద్రం ప్యాకేజీ మాత్రమే ఇవ్వగలదని.. హోదా సాధ్యం కాదన్నారు పురందేశ్వరి. తెలంగాణతో కలిసి గోదావరి జలాలను తరలించే విషయంపై అఖిలపక్షం నిర్వహించాకే సీఎం నిర్ణయం తీసుకోవాలన్నారు. టీడీపీ హయాంలో కులాలు, కార్పొరేషన్ల పేరుతో విభజన రాజకీయాలు చేశారని.. ఇలాంటి విధానాలను ప్రజలు గమనిస్తున్నారని..వైసీపీ ఆ దిశగా వెల్లకూడదని కోరుకుంటున్నట్టు తెలిపారు.