ఇప్పుడు వివాహేతర సంబంధం నేరం కాదు.. హైకోర్టు ఏం చెప్తుందంటే ??
వివాహేతర సంబంధాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహేతర సంబంధం నేరం కాదని తేల్చి చెప్పింది. అది నైతికతకు సంబంధించిన అంశమని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ ఓ వ్యక్తి.. భార్య, ప్రియుడికి ఢిల్లీ హైకోర్టు విముక్తి కలిగించింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాలు ప్రకారం.. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఓ హోటల్‌లో వారిద్దరూ దగ్గరయ్యారని మహిళ భర్త ఆరోపిస్తూ కోర్టుకెక్కాడు. ఈ కేసులో ఆ ప్రియుడిని మేజిస్ట్రేట్ కోర్టు విడిచిపెట్టేసింది. దీంతో బాధిత భర్త సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న కోర్టు ప్రియుడికి సమన్లు పంపింది. దీనిని అతడు ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశాడు. అక్కడ కూడా అతడికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యను భర్త ఆస్తిగా పరిగణించే మహాభారత కాలం నాటి భావజాలానికి కాలం చెల్లిందని పేర్కొంది. వివాహేతర సంబంధం నేరమంటూ ఐపీసీ 497 సెక్షన్ ఇచ్చిన నిర్వచనం రాజ్యాంగబద్ధం కాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ గుర్తుచేశారు. వివాహేతర సంబంధం నైతికతకు సంబంధించిన అంశమని, దానిని నేరంగా చూడటం సరికాదని స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

