Rashmika Mandanna: రష్మిక రియల్ లైఫ్ కష్టాలు తెలుసా ??
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ క్వీన్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే పాన్-ఇండియా హీరోయిన్ గా ఎదిగింది. పుష్ప శ్రీవల్లి నుండి ఛావా యేసుబాయి వరకు రష్మిక తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోలేదు. యాక్టర్ అయ్యేందుకు ఆమె ఎన్నో కష్టాలు అనుభవించింది.
చివరకు అనుకున్నది సాధించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన్న కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత వచ్చిన అంజని పుత్ర, చమక్ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. 2018లో ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వరుస సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయితే ఆమె జీవితం పూలపాన్పు ఏమీ కాదు. చిన్నప్పుడుఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. బాల్యంలో తన తల్లిదండ్రులు అద్దె కట్టలేక ఎన్నోసార్లు ఇళ్లు మార్చుకోవాల్సి వచ్చిందని, పేరెంట్స్ పడుతున్న కష్టాలు చూసి కనీసం ఓ బొమ్మ కొనివ్వమని కూడా అడిగేదాన్ని కాదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. చిన్నప్పుడు పడ్డ ఆ ఆర్థిక కష్టాలే తనకు డబ్బు విలువ తెలియజేసిందంటుంది రష్మి, రష్మిక మందన్న గత రెండేళ్లలో నటించిన మూడు బ్లాక్‌బస్టర్ సినిమాలైన యానిమాల్, పుష్ప 2, ఛావా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 3వేల 300 కోట్లకుపైగా వసూళ్లు సాధించాయి. ఈ బాక్సాఫీస్ సునామీతో బాలీవుడ్ టాప్ హీరోయిన్లను సైతం రష్మిక వెనక్కి నెట్టింది. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం రష్మిక నెట్ వర్త్ 66 కోట్లు. పుష్ప 2 : ది రూల్ మూవీకి ఆమె 10 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

