బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 విషయంలోనూ అదే సెంటిమెంట్ వర్క్ అవబోతోందా..? మొదటి సీజన్ తప్ప, రెండు, మూడు సీజన్లలో జరిగిందే నాలుగో సీజన్‌లో జరగబోతోందా..? అదే జరిగితే విజేతగా ఎవరు నిలుస్తారో తెలుసా..? అయితే ఈ కథనాన్ని చదివేయండి…
బిగ్‌బాస్ షోనే ఒక వింత. ఆ ఇంటికి చేరాక హీరోలు జీరోలవుతుంటారు, జీరోలు హీరోలవుతుంటారు. స్ట్రాంగ్ అనుకున్నవాళ్లు మధ్యలోనే ఎలిమినేట్ అవుతారు, ఊహించని కంటెస్టెంట్లు చివరి వరకూ వెళ్తుంటారు. ఇలా ఎన్నో జంతర్‌మంతర్ మాయలు చోటు చేసుకునే చోటే బిగ్‌బాస్. అయితే బిగ్‌బాస్ సీజన్లలో జరిగిన ఒక సాంప్రదాయం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అదే నామినేసన్ సెంటిమెంట్… ఇంతకీ ఈ నామినేషన్ సెంటిమెంట్ ఏంటో… దాని కథ ఏంటో ఓసారి చూద్దాం….
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో అభిజిత్ ఇప్పటి వరకు 1 సార్లు నామినేట్ అయ్యాడు. నామినేషన్లో ఉన్న ప్రతీసారి అభి అత్యధిక ఓట్లతో తిరిగి బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగారు. అలా 11 సార్లు అభి నామినేట్ అవడంతో ప్రజల నుంచి అభిజిత్‌కు ఆదరణ లభించింది. ఆయనకు అత్యధిక ఓట్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో అభి ఇప్పుడు టాప్ 5 లో ఉన్నాడు. అయితే ఇన్నా్ళ్లు నామినేషన్‌లో ఉండడంతో అభి అభిమానులకు ఓట్లు వేయడం అలవాటైంది. సో గ్రాండ్ ఫినాలే, టైటిల్ రేసులో అభిని గెలిపించేందుకు అతడి అభిమానులు ఓటింగ్‌లో దూసుకుపోతున్నారు. చాలా మంది సోషల్ మీడియా వేదికగా అభిజిత్ విన్నర్ అనే క్యాంపేన్ చేస్తున్నారు.
బిగ్‌బాస్ మొదటి సీజన్ మినహా రెండో సీజన్‌లో కౌశల్ మండా కూడా 11 సార్లు నామినేట్ అయ్యాడు. గీతా మాధురి తనకు లభించిన సూపర్ పవర్‌తో అతడిని సీజన్ మొత్తం నామినేట్ చేసింది. అయినా సరే ప్రతిసారి ఎక్కువ ఓట్లతో సేవ్ అవుతూ…కౌశల్ చివరికి విజేతగా నిలిచాడు.
మూడో సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ కూడా 11 సార్లు నామినేట్ అయ్యాడు. పునర్నవిని నామినేషన్స్ నుంచి సేవ్ చేయడం కోసం సీజన్ మొత్తం తనను తాను నామినేట్ చేసుకున్నాడు. అయినా సరే ప్రేక్షకుల సపోర్ట్‌తో చివరికి ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. ఇక ఈసారి కూడా అభిజిత్ 11 సార్లు నామినేషన్‌లో ఉండి సేవ్ అవుతూ టాప్ 5లోకి చేరుకున్నాడు. దీంతో మరోసారి 11 సెంటిమెంట్ వర్కవుట్ అయితే అభిజిత్ విజేతగా నిలవడం ఖాయం అనిపిస్తోంది. మరి అది తెలియాలంటే డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలే కోసం ఎదురు చూడాల్సిందే