Top 5 contestants Bigg Boss: ఈ వారం హౌజ్‌మేట్స్‌కి మరోసారి సర్‌ప్రైజ్ ఇచ్చారు నాగార్జున. వారాంతం ఎపిసోడ్‌లో భాగంగా కంటెస్టెంట్‌ల బంధువులను స్టేజ్‌మీదికి తీసుకొచ్చాడు. అయితే ఇక్కడే ఓ మెలికను పెట్టారు. తాను అడిగే ప్రశ్నలకు స్ట్రైట్ ఫార్వర్డ్‌గా సమాధానం చెప్పాలని, అది నచ్చితేనే ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడకు వస్తారని చెప్పారు. ఈ క్రమంలో అవినాష్ మినహా.. అందరి బంధువులు వచ్చారు. ఈ సందర్భంగా వారితో టాప్ 5లో ఎవరు ఉంటారు..? అని హౌజ్‌మేట్స్ బంధువుల నుంచి కూపీ లాగారు. వారిలో ఎవరెవరు ఏం చెప్పారంటే..
హారిక బ్రదర్ కార్తీక్.. హారిక, అభిజిత్, లాస్య, సొహైల్, అరియానా
అఖిల్ అన్న సాయి..సొహైల్, అభిజిత్, అఖిల్, అరియానా, అవినాష్
అరియానా చెల్లి మృగనయని.. అరియానా, అఖిల్, సొహైల్, హారిక, అవినాష్
లాస్య తల్లి శాంతమ్మ.. లాస్య, అభిజిత్, సొహైల్, అఖిల్, హారిక
సొహైల్ బ్రదర్స్.. సొహైల్, అభిజిత్, అఖిల్, అవినాష్, అరియానా
అభిజిత్ నాన్న.. అభిజిత్, సొహైల్, హారిక, అఖిల్, మోనాల్
మోనాల్ తల్లి.. అభిజిత్, మోనాల్, అఖిల్, లాస్య, సొహైల్
మొత్తానికి అందరు బంధువులు ఎక్కువగా అభిజిత్, సొహైల్, అఖిల్, హారిక, అరియానాలకు ఓటు వేశారు.