Bigg Boss 4: అతడిపై ప్రతీకారం తీర్చుకున్న స్వాతి

| Edited By:

Oct 05, 2020 | 7:00 AM

శనివారం నాటి ఎపిసోడ్‌లో స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. మూడో వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి వెళ్లిన స్వాతి

Bigg Boss 4: అతడిపై ప్రతీకారం తీర్చుకున్న స్వాతి
Follow us on

Swathi Deekshith Bigg Boss 4: శనివారం నాటి ఎపిసోడ్‌లో స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. మూడో వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి వెళ్లిన స్వాతి.. ఒక్క వారానికే ఇంటి బాట పట్టింది. అమ్మ రాజశేఖర్ మాస్టర్ స్వాతిని ఎలిమినేషన్‌కి నామినేట్ చేయగా.. ఆమె ఆటతీరు పెద్దగా బాలేదంటూ ప్రేక్షకులు కూడా వ్యతిరేకంగా ఓట్లు వేశారు. దీంతో స్వాతి బయటకు వచ్చేసింది.

ఈ క్రమంలో ఆదివారం నాటి ఎపిసోడ్‌లో స్వాతిని స్టేజీపైకి పిలిచిన నాగార్జున, ఆమెతో ఆట ఆడించారు. ఈ క్రమంలో  కార్డులపై కొన్ని లక్షణాలు రాసి.. ఆ లక్షణం హౌజ్‌లో ఏ వ్యక్తికి సెట్ అవుతుందో చెప్పి దానికి కారణం చెప్పాలని నాగార్జున సూచించారు. ఈ సందర్భంగా కుమార్‌ సాయిని  న‌క్క తోక తొక్కిన వ్య‌క్తిగా స్వాతి పేర్కొన్నారు. అతడు చాలా టాలెంటెడ్ అని, కానీ వెనుక నుంచి ఎవరైనా తోస్తే తప్ప తన టాలెంట్‌ని బయట పెట్టరని అన్నారు.

ఇక అన్నం పెట్టిన అమ్మ రాజ‌శేఖర్ మోసం చేశార‌ని.. అతడు నమ్మకద్రోహి అని తెలిపారు. ఇక సుజాత‌ను పుకార్ల పుట్ట‌గా, సోహైల్‌ని దొంగ‌గా, లాస్య‌ను అవ‌కాశ‌వాదిగా, నోయ‌ల్‌ను గుడ్డిగా న‌మ్మే వాడిగా, మోనాల్‌ని  ఏమార్చే వ్య‌క్తిగా, మెహ‌బూబ్‌ని అనుసరించే వ్యక్తిగా వెల్లడించారు. అలాగే అరియానా ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అని, హారిక ట్యూబ్‌లైట్ అని, అభిజిత్ అహంకారి‌ అని, గంగ‌వ్వ‌ చాడీల చిట్టా అని, అఖిల్ గ‌మ్యం లేని వ్య‌క్తి అని తెలిపారు. కాగా హౌజ్‌లో అవినాష్ తన ఫేవరెట్‌ అని స్వాతి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తన ఎలిమినేషన్‌కి కారణమైన అమ్మ రాజశేఖర్ మాస్టర్‌ కెప్టెన్సీ రేసులో పాల్గొనడానికి వీలు లేద‌ని అత‌డిపై స్వాతి బిగ్‌బాంబ్ వేశారు.

Read More:

IPL 2020: CSK vs KXIP : గర్జించిన చెన్నై, పంజాబ్‌పై ఏకపక్ష విజయం

నూతన ఒరవడి : హెచ్​ఐవీ పాజిటివ్​ జంటలకు పెళ్లిళ్లు