Bigg Boss 4 Monal: బిగ్‌బాస్ 4లో ఐదో వారం ఎలిమినేషన్‌లో భాగంగా నామినేషన్ జరిగే సమయంలో చిన్నపాటి సమరం జరిగింది. ముఖ్యంగా అభిజిత్, అఖిల్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. పదే పదే మోనాల్ ప్రస్తావన తీసుకువచ్చి, వారిద్దరు కొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. దీంతో మోనాల్ బోరును ఏడ్చేసింది. ఐ లైక్ యు అన్నానంటే ఇద్దరూ ఇష్టమేనని, ఎవరైనా ఇష్టమేనని.. అది మీరు మీరూ చూసుకోవాలని ఆమె అన్నారు. ఇదొక నేషనల్ ఛానెల్ అని, ఇక్కడ జరుగుతున్నది అందరూ చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కారెక్టర్‌ని బ్యాడ్ చేసి, జీవితాలతో ఆడుకోవద్దని సూచించింది. తన కారెక్టర్‌తో ఆటలు ఆడొద్దని, తన కారెక్టర్‌ని జడ్జ్ చేయడానికి మీరు ఎవరని, తన పరువును తీయకండి అంటూ గుండెలు అవిసేలా గట్టిగా రోధించింది. దీంతో గంగవ్వ వచ్చి మోనాల్‌ని ఓదార్చింది. అయితే ఈ సారి ఎలిమినేషన్‌లో మోనాల్‌ని పలువురు నామినేట్ చేసిన విషయం తెలిసిందే.
Read More:
Bigg Boss 4: హాట్‌హాట్‌గా నామినేషన్ల ప్రక్రియ.. కంటెస్టెంట్‌ల మధ్య మాటల యుద్ధం