Bigg Boss captaincy Task: ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ కాయిన్స్ టాస్క్ ఇచ్చాడు. పై నుంచి కాయిన్లు వేస్తామని, ఏరుకోవాలని.. ఎవరి దగ్గర ఎక్కువ కాయిన్లు ఉంటే వారే కెప్టెన్ అని బిగ్‌బాస్ తెలిపాడు. ఇక ఈ టాస్క్‌లో ఎవరికి వారు ఆడుతుంటే అఖిల్- మోనాల్‌లు మాత్రం కలిసి ఆడారు. ఈ సందర్భంగా అభి.. మీరిద్దరు కలిసి ఆడుతున్నారా…? నీ కాయిన్లు అఖిల్‌కి ఇస్తున్నావా..? అని ప్రశ్నించాడు.
ఇక అభి, కుమార్ దాచుకున్న కాయిన్లను దివి ఒక్కడి కూడా మిగల్చకుండా ఎత్తుకుపోయింది. దీంతో నా కాయిన్లు నేను తీసుకుంటానంటూ కుమార్ సాయి రాగా.. మధ్యలో అడ్డుకున్న మాస్టర్, దివికి మద్దతు ఇచ్చాడు. సొహైల్ అందరివీ కొట్టేస్తున్నాడని ఎవరో అనడంతో గేమ్‌ని గేమ్‌లా ఆడండని మండిపడ్డాడు. తనను దొంగ అనడంతో దివి, సుజాతలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. దివి నువ్వేం తక్కువ కాదు, కుమార్ దగ్గర బాగానే కొట్టేశావ్ అని చురకలంటించాడు. ఇక సుజాత దగ్గరకు వెళ్లి సారీ చెప్పాడు.
ఇదిలా ఉంటే మాస్టర్, అరియానా కాయిన్లను లేపేశాడు. ఆ విషయం తెలియని అరియానా మాస్టర్ వద్దకు వెళ్లి తన గోడును వెళ్లబెట్టింది. దానికి అయ్యో, నేనిస్తాను అని నటించి ఆమెను బాగానే బురిడీ కొట్టించాడు. చాలా సేపటికి ఆ కాయిన్లను తాను తీసినట్లు వెల్లడించాడు.
Read More: